Monday, June 15, 2026
Homeసినిమాజులై 22న 'మీలో ఒకడు' గ్రాండ్ రిలీజ్

జులై 22న ‘మీలో ఒకడు’ గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ మ‌రో ఇంట్ర‌స్టింగ్ స‌బ్జెక్టు మూవీ రాబోతోంది. శ్రీమ‌తి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ”మీలో ఒకడు”. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. కృష్ణ భ‌గ‌వాన్, స‌మీర్, అశోక్ కుమార్, బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

కుప్పిలి శ్రీనివాస్ స‌ర‌స‌న హ్రితిక సింగ్, సాధన పవన్ న‌టించిన ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని U/A స‌ర్టిఫికేట్ సొంతం చేసుకుంది. సెన్సార్ స‌భ్యులతో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ మూవీని జులై 22న స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ థియేట‌ర్‌ల‌లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. కాగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ అధ్య‌క్షులు కొల్లి రామకృష్ణ, నిర్మాత మండ‌లి సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్, దైవజ్ఞ శ‌ర్మ‌, న‌టులు అశోక్ కుమార్, స‌మీర్, బ‌స్టాప్ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular