Saturday, January 18, 2025
Homeసినిమామెగాస్టార్ నుంచి హరీశ్ శంకర్ కి గ్రీన్ సిగ్నల్! 

మెగాస్టార్ నుంచి హరీశ్ శంకర్ కి గ్రీన్ సిగ్నల్! 

చిరంజీవి ఒకప్పుడు సీనియర్ దర్శకులతోనే వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో ఆయనకి కథలు వినిపించి ప్రాజెక్టులు ఓకే చేయించుకున్న దర్శకులు అరడజనుకి పైనే ఉన్నారు. అలాంటివారి జాబితాలో హరీశ్ శంకర్ కూడా ఉన్నారు. అయితే ఇంతవరకూ చిరంజీవి సినిమా హరీశ్ శంకర్ తో ఎప్పుడు ఉంటుందనే విషయంలో ఒక క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తోంది.

అసలు ఈ పాటికే పవన్ తో హరీశ్ శంకర్ సినిమా థియేటర్లకు రావలసింది. కానీ కొన్ని కారణాల వలన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆలస్యమవుతూ వచ్చింది. ఎన్నికలు పూర్తయిన తరువాత పవన్ ఈ సినిమాను పూర్తిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోగా రవితేజ ప్రాజెక్టును సెట్ చేసుకున్న హరీశ్ శంకర్, ‘మిస్టర్ బచ్చన్’ ను ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకుని వెళుతున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నెక్స్ట్ మూవీ చిరంజీవితోనే ఉండనుందని అంటున్నారు. ఆ దిశగా సన్నాహాలు మొదలయ్యాయని చెబుతున్నారు.

ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాను చేస్తున్నారు. జూలై నాటికి ఈ సినిమా షూటింగు పూర్తవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఆగస్టు నుంచి షూటింగు పెట్టుకోమని హరీశ్ తో మెగాస్టార్ చెప్పినట్టుగా సమాచారం. అప్పటికి రవితేజ సినిమా షూటింగు కూడా హరీశ్ పూర్తిచేసే ఛాన్స్ కనిపిస్తోంది. చిరంజీవితో హరీశ్ శంకర్ ఎలాంటి కథను .. ఏ జోనర్ లో చేయనున్నాడు? అనేది త్వరలో తెలియనుంది. ఇక ఈ ప్రాజెక్టుతో సమానంగా గానీ, ఆ తరువాత గానీ పవన్ సినిమాను కూడా హరీశ్ పూర్తిచేనున్నాడు. ఇలా పక్కపక్కనే మెగాస్టార్ – పవర్ స్టార్ సినిమాలు చేసే ఛాన్స్ రావడం నిజంగా అరుదైన విషయమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్