Sunday, January 19, 2025
Homeసినిమాఅద్భుతాలు నువ్వు మాత్రమే చేయగలవు: తమ్ముడికి చిరు శుభాకాంక్షలు

అద్భుతాలు నువ్వు మాత్రమే చేయగలవు: తమ్ముడికి చిరు శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన సోదరుడు, మెగా స్టార్ చిరంజీవి శుబాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సిన సమయంలో కావాల్సిన నాయకుడిగా వచ్చిన పవన్ ప్రజల గుండెల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. చిరంజీవి, సురేఖ దంపతులతో పవన్ దిగిన్ ఓ ఫోటోను ఆయన దీనికి జత చేశారు.

“కళ్యాణ్ బాబు… ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ!” అంటూ తన సోదరుడిని దీవించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్