Friday, March 20, 2026
Homeసినిమాఫిబ్రవరిలో వస్తున్న ‘ఆచార్య’

ఫిబ్రవరిలో వస్తున్న ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ విడుదల తేదీ ఖరారైంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా దాదాపు పూర్తయ్యాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో విడుదల తేదీపై మల్ల గుల్లాలు పడుతూ వస్తున్నారు. చివరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు.

దసరా, దీపావళికి పలు చిన్న హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. బాలకృష్ణ ‘అఖండ’ నవంబర్ చివర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ‘పుష్ప’ సంక్రాంతికి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’; ప్రభాస్ రాధే శ్యాం, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలు విడుదల కానున్నాయి, తేదీలు కూడా దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన ‘ఆచార్య’ ను ఫిబ్రవరి మొదటి వారానికి ఖరారు చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. చిరు సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సందిగ్ధ వాతావరణం కారణంగా పెద్ద సినిమాలు నిర్మాణం పూర్తి చేసుకున్నా విడుదల చేయలేకపోతున్నామని, ప్రభుత్వాలు కనికరం చూపాలని, సినిమా రంగానికి సహకరించాలని ఇటీవల జరిగిన ‘లవ్ స్టొరీ’ ప్రీ రిలీజ్ వేదికలో చిరంజీవి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాల నుంచి నిర్దిష్ట హామీ కానీ, జీవోలు కానీ రాకుండానే ‘ఆచార్య’ విడుదల తేదీని ప్రకటించడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular