Saturday, January 18, 2025
Homeసినిమామ‌రో ఐదు క‌థ‌ల‌కు చిరు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా?

మ‌రో ఐదు క‌థ‌ల‌కు చిరు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా?

Mega Speed: మెగాస్టార్ చిరంజీవి న‌టించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య‌’. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా  29న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాతో పాటు చిరంజీవి గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్, వాల్తేరు వీర‌య్య సినిమాలు చేస్తున్నారు. అలాగే యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల‌తో కూడా సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. దీంతో ఐదు సినిమాల‌తో బిజీగా ఉన్నారు.
అయితే.. ఆచార్య ప్ర‌మోష‌న్లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో ఇంత ఉత్సాహంగా ఎలా వ‌ర్క్ చేస్తున్నారు.? అని అడిగితే.. అందుకు చిరంజీవి తనదైన స్టైల్లో స్పందించారు. ఇప్పుడు నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయని అనుకుంటున్నారు. మీకు తెలియ‌ని విష‌యం ఏంటంటే.. మరో ఐదు కథలు కూడా రెడీ అవుతున్నాయని చెప్పి షాక్ ఇచ్చారు. గాడ్ ఫాద‌ర్, బాబీతో చేస్తున్న సినిమాల షూటింగ్ రాత్రి వేళ‌ల్లోనే జ‌రుగుతుంది. అయినా.. నేను అలసటగా ఫీలవ్వలేదు. మరింత ఉత్సాహంతో  పని చేశాను అని చెప్పారు. అయితే.. మ‌రో ఐదు క‌థ‌లు రెడీ అవుతున్నాయి అని చెప్పిన‌ప్ప‌టి నుంచి ఆ ఐదు క‌థ‌లు చెప్పిన ద‌ర్శ‌కులు ఎవ‌రు అనేది ఆస‌క్తిగా మారింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్