Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Mega Multi-starrer: మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య చిత్రం ఈ నెల 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. అలాగే బాబీ డైరెక్ష‌న్ లో వాల్తేరు వీర‌య్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల‌తో పాటు ఛ‌లో, భీష్మ చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఓ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ డివివి దాన‌య్య నిర్మించ‌నున్నారు.

అయితే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ వ‌చ్చింది. అది ఏంటంటే.. ఇందులో చిరంజీవితో పాటు మ‌రో స్టార్ హీరో కూడా న‌టించ‌నున్నార‌ట‌. ఇది ఓ మెసెజ్ ఓరియంటెడ్ మూవీ అని స‌మాచారం. ఈ మూవీలో చిరంజీవితో పాటు న‌టించేందుకు ఎవ‌రైతే బాగుంటారా అని కొంత మంది స్టార్ హీరోల‌ను ప‌రిశీలించార‌ని టాక్ వినిపిస్తోంది. గాడ్ ఫాద‌ర్ లో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో ఉండే స్టార్ హీరోని తీసుకోవాల‌ని ట్రై చేస్తున్నార‌ట‌. మ‌రి.. ఆ స్టార్ హీరో ఎవ‌రో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : పూరీ జగన్నాథ్ కు మెగా ఛాన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com