Friday, April 19, 2024
Homeసినిమాకేజీఎఫ్ 2 పై పుష్ప‌రాజ్ ప్రశంసల జల్లు

కేజీఎఫ్ 2 పై పుష్ప‌రాజ్ ప్రశంసల జల్లు

Pushpa on KGF-2: క‌న్న‌డ స్టార్ య‌ష్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం కేజీఎఫ్ 2. ఈ క‌న్న‌డ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డుల‌ను క్రాస్ చేసి.. స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది.  ప్ర‌పంచ వ్యాప్తంగా 7 రోజుల్లోనే 700 కోట్ల‌కు పైగా కలెక్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఇదిలా ఉంటే.. కేజీఎఫ్ 2 సినిమా గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్ట‌ర్లో స్పందిస్తూ.. బిగ్ కంగ్రాట్యూలేష‌న్స్ టు కేజీఎఫ్ 2 టీమ్ అంటూ హీరో య‌ష్‌, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి, ర‌వీనా టాండ‌న్, సంజ‌య్ ద‌త్, అలాగే టెక్నిక‌ల్ టీమ్ అంద‌ర్ని అభినందించారు.

ఈవిధంగా కేజీఎఫ్ 2 టీమ్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించి ఆకాశానికి ఎత్తేశారు. అల్లు అర్జున్ స్పంద‌న పై ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ.. థ్యాంక్యూ ఫ‌ర్ యువ‌ర్ ఎంక‌రేజ్మెంట్ అంటూ పోస్ట్ చేశారు. ర‌వీనా టాండ‌న్ కూడా బ‌న్నీ పోస్ట్ పై స్పందిస్తూ.. నేను నీకు పెద్ద ఫ్యాన్ ని. కేజీఎఫ్ 2 న‌చ్చినందుకు.. అభినందించినందుకు థ్యాంక్యూ అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Also Read : కేజీఎఫ్ 2 సంచ‌ల‌నం

RELATED ARTICLES

Most Popular

న్యూస్