Thursday, March 28, 2024
Homeసినిమాఆదివారం వరకే వ్యాక్సిన్ డ్రైవ్

ఆదివారం వరకే వ్యాక్సిన్ డ్రైవ్

కరోనా క్రైసిస్ ఛారిటి (సిసిసి)ని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టింది. 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు.  ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ సక్సెస్ గా పూర్తి చేసి రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా అందిస్తున్నారు. బ్లడ్ బ్యాంకులో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సి సి సి సభ్యులు సందర్శించారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ “ప్రపంచం అంతా సంవత్సరంన్నర నుండి అతలాకుతలం అవుతోంది. సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.  అలాంటి సమయంలో చిరంజీవి గారు స్పందించి కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి గారి సంకల్పం వల్లే ఈ రోజు కార్మికులకు వాక్సిన్ అందింది.  అలాగే కరోనా నుండి ప్రజలను కాపాడడానికి ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశారు.  ఇప్పటి వరకు 4000 మందికి పైగా వాక్సిన్ వేసుకున్నారు. ప్రస్తుతం రోజు షూటింగ్స్ బిజీగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎక్కడ, ఎవరూ ఖాళీగా లేని పరిస్థితి.  ఇలాంటి సమయంలో తప్పకుండా అందరు వాక్సిన్ వేసుకుంటే ఇంకా మంచిది. అందరు స్వతహాగా వాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా చారిటబుల్ ట్రస్ట్ వారికీ, సీసీసీ టీం, అపోలో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను” అన్నారు.

దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ “ సిసిసి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. మొదటి డోస్ సక్సెస్ ఫుల్ గా నడిచింది.. ఇప్పుడు రెండో డోస్ కూడా ఇస్తున్నారు.. కాబట్టి  సినిమా కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సినిమా రంగానికి సంబందం ఉన్న అందరూ దయచేసి వాక్సిన్ తీసుకోవడనికి ముందుకు రావాలి. సెప్టెంబర్ 12, ఆదివారంతో ఈ డ్రైవ్ ముగుస్తుంది కాబట్టి.. సీసీసీ ఆధ్వర్యంలో మొదటి డోస్ వేసుకున్న వారంతా సెకండ్ డోస్ వేసుకోవాలని కోరుకుంటున్నాను.  అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అన్నారు.

చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్  వల్లభనేని అనిల్ మాట్లాడుతూ “లాక్ డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో సి సి సి నీ మనకోసం ఏర్పాటు చేసి, దానికి కమిటీని నియమించి, సినిమా రంగంలోని పెద్దలందరిని భాగస్వాములను చేసిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. వేలాదిమంది సినీ కార్మికుల ఆకలి తీర్చే సంకల్పంతో మూడు దఫాలుగా నిత్యావసర వస్తువులు ఇంటింటికీ పంచి ఆదుకున్న విషయం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. కరోనా రెండవదశలో ప్రతి సినీ కార్మికుడికి ఆరోగ్య భద్రత కల్పించాలని సత్సంకల్పంతో మీరు వాక్సినేషన్ వేయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిశ్రమ కోలుకుంటుంది అనుకున్న సమయంలో మళ్ళీ లాక్ డౌన్ పడడంతో .. సినిమా కార్మికులకు ఎలాగైనా వాక్సిన్ వేయిచాలని నిర్ణయించి, వాక్సిన్ దొరకని పరిస్థితుల్లో కూడా అపోలో 24/7 సౌజన్యంతో మీరు ముందుకు వచ్చి అందరి సినీ కార్మికులకు వాక్సినేశన్ వేయించి, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్