Saturday, January 18, 2025
Homeసినిమాతారక్ తో మాట్లాడిన చిరు

తారక్ తో మాట్లాడిన చిరు

కోవిడ్ బారిన పడ్డ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను మెగాస్టార్ చిరంజీవి ఫోన్లో పరామర్శించారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేశారు. తారక్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్ లో వున్నారని, తారక్ పాటు కుటుంబ సభ్యులందరూ కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటున్నారని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.

తారక్ ఉత్సాహంగా ఉన్న విషయం తెలిసిన తర్వాత చాలా ఆనందం వేసిందని చెప్పిన చిరు… త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. గాడ్ బ్లెస్ అంటూ శుభాకాంక్షలు అందించారు.

రాజమౌళి రూపొందిస్తున్న ఆర్.ఆర్.ఆర్. సినిమాలో రామ్ చరణ్, జునియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలైనప్పటినుండి ఇరు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. పుట్టినరోజు వేడుకలు, పండుగల సందర్భంలో రెండు కుటుంబాలు తరచూ కలుసుకుంటున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్