Saturday, January 18, 2025
Homeసినిమాటీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ అండ

టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ అండ

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన దాతృత్వం, ప్రతిభావతుల పట్ల తనకుండే అభిమానం నిరూపించుకున్నారు. నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి తక్షణ ఖర్చుల కోసం చిరంజీవి లక్ష రూపాయలు అందజేశారు. చిరుపై అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్ తనదైన మార్గాన్ని ఎంచుకుని ఎదిగారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన మెగాస్టార్ చిరంజీవి తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు.

టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తుచేశారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

మీరంటే వీరాభిమానం: చిరుతో టీఎన్ఆర్ భార్య

‘మీరంటే వీరాభిమానం సార్. తన 200వ ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారు. ఇంత వరకు మిమ్మల్ని కలవలేదు. మీరు మాకిలా ఫోన్ చేయడం ఎంతో సంతోషం కలిగించింది’ అంటూ టీఎన్ఆర్ సతీమణి జ్యోతి చిరుతో అన్నారు.  తమ కుటుంబానికి సాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్