Thursday, June 18, 2026
Homeసినిమాశ్రీవిష్ణు 'సామజవరగమన' ట్రైలర్ విడుదల..

శ్రీవిష్ణు ‘సామజవరగమన’ ట్రైలర్ విడుదల..

యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పణలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జూన్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

సామజవరగమన ట్రైలర్‌ మొత్తం కామెడీ ప్రధానంగా సాగిపోయింది. శ్రీవిష్ణు తన కామెడీ టైమింగ్ పవర్ ఏంటో మరోసారి చూపించాడు. కొన్ని యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయి. అమ్మాయిలకు దూరంగా ఉండే క్యారెక్టర్‌ను శ్రీ విష్ణు ఈ చిత్రంలో చేయనున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అమ్మాయిలతో అతడు రాఖీ కట్టించుకుంటుంటాడు. అయితే, ఆ తర్వాత అతడు హీరోయిన్‍తో లవ్‍లో పడతాడని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు.. థియేటర్లో టికెట్లు ఇచ్చే ఉద్యోగి ‘బాక్సాఫీస్ బాలు’ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. అతడి ‘మధ్యతరగతి’ తండ్రి పాత్రను సీనియర్ యాక్టర్ నరేశ్ పోషించాడు.

శ్రీవిష్ణు, నరేశ్‍, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా ఉన్నాయి. పంచ్‍లు కూడా పేలాయి. “వాడి దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్ అంటే కేజీఎఫ్‍లో బానిసలు” అంటూ హీరోయిన్‍తో నరేశ్ డైలాగ్ చెబుతాడు. ఇంకా మరికొన్ని పంచ్‍లు కూడా ఈ ట్రైలర్‌లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular