Tiger launched: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న`టైగర్ నాగేశ్వరరావు` చిత్రం శుభకృత్ నామ సంవత్సరం ఆరంభమైన ఉగాది పర్వదినాన కనులపండువగా ప్రారంభమైంది. కరోనా తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగవైభంగా జరిగిన ఈ వేడుక మాదాపూర్‌లోని నోవాటెల్‌లో (హెచ్‌ఐసిసిలో) జరిగింది. పూజా కార్యక్రమాలు అనంతరం హీరో రవితేజ, హీరోయిన్లు నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌ల పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ముఖ్య అతిథి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా, కెమేరా స్విచ్చాన్ తేజ్ నారాయణ అగర్వాల్ చేశారు. కిషన్ రెడ్డి స్క్రిప్ట్‌ని అందజేశారు. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గౌరవ దర్శకత్వం వహించారు. టైగర్ నాగేశ్వరరావు ప్రీ-లుక్ మోషన్ పోస్టర్‌ను చిరంజీవి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలని ఆకాంక్షించారు. టైగర్ నాగేశ్వరరావు కథను కరోనా సమయంలో దర్శకుడు వంశీ నాకు కథ వినిపించారు. చాలా అద్భుతంగా నెరేట్ చేశారు. ఆ తర్వాత నాకు సాధ్యపడలేదు. ఇప్పుడు నా తమ్ముడు రవితేజ చేయడం చాలా సంతోషంగా వుంది. ఈ స్టూవర్ట్ పురం నాగేశ్వరరావు గురించి నేను చాలా చిన్నప్పుడే విన్నాను. మా నాన్నగారు చీరాల-పేరాలలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ పక్కనే స్టువర్ట్‌పురం వుండేది. అక్కడి వారంతా నాగేశ్వరరావుని హీరోగా కొనియాడుతుండేవారు.
ఆసక్తితో నాన్నగారి నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇన్నాళ్ళ తర్వాత ఆయన గురించి వంశీ కమర్షియల్ కథగా తీర్చిదిద్దారు. తమ్ముడు రవితేజ సినిమా చేయడం శుభం. అందుకు అభిషేక్ అగర్వాల్ పూనుకోవడం చాలా ఆనందంగా వుంది. ఇటీవలే వారు కశ్మీర్ ఫైల్స్‌తో సక్సెస్ మూడ్‌లో వున్నారు. కొత్త సంవత్సరంలో పూర్తయి త్వరగా విడుదలయి కశ్మీర్ ఫైల్స్ ఎంత హిట్టయిందో అంతకంటే హిట్ అయి రవితేజకు, అభిషేక్‌కు, వంశీకి మంచి జరగాలని కోరుకుంటున్నానని” అన్నారు.
Also Read : ‘టైగర్ నాగేశ్వరరావు’తో నూపూర్ సనన్