Sunday, November 24, 2024
HomeTrending Newsటిటిడికి ఎలక్ట్రిక్  బస్సులు సిద్ధం

టిటిడికి ఎలక్ట్రిక్  బస్సులు సిద్ధం

తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే  ఎలక్ట్రిక్  బస్సుల నమూనా  సిద్ధమైంది. ఎం ఈ ఐ ఎల్  గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్​ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్ లో తయారు  చేస్తోంది.  తి తి దే  మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి  బస్సును  గురువారం దేవస్థానముల రవాణా విభాగం జనరల్ మేనేజర్ పి వీ  శేషారెడ్డి    సమగ్రంగా పరిశీలించారు. ఒలెక్ట్రా తయారు చేసిన  అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)కు  అందించాలని ఎం ఈ ఐ ఎల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బస్సులను తిరుమలను సందర్శించే భక్తులకు కాలుష్య రహిత ప్రయాణం అందించేందుకు  టీటీడి వినియోగించనుంది.  టి టి డి అధికారులకు  బస్సు పనితీరును ఒలెక్ట్రా ప్రతినిధులు  వివరించారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా బస్సును తయారు చేశామని తెలిపారు.

బస్సుల్లో ఎలెక్ట్రానిక్ డిస్ ప్లే బోర్డ్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయా ణిస్తోందో తెలిపే వివరాలు పొందుపరిచారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలో  తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది, తిరుమల  పవిత్రత, ప్రాశస్త్యాన్ని తెలిపే ఫోటోలను బస్సు పై పొందు పరిచారు. బస్సులో  కొద్దిదూరం ప్రయాణించిన శేషారెడ్డి  దాని పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం తో పాటు దేవస్థానం పాలకవర్గం, ఉన్నతాధికారులకు   దాని   పని తీరును వివరిస్తానని తెలిపారు. ఎం ఈ ఐ ఎల్   విద్యుత్ బస్సులను అందించటం సంతోషంగా ఉందని, వీటి వల్ల  తిరుమల కొండపై  కాలుష్య నియంత్రణ జరుగుతుందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్