Saturday, June 13, 2026
Homeసినిమామహేష్‌ మూవీకి భారీ డీల్ కుదిరిందా...?

మహేష్‌ మూవీకి భారీ డీల్ కుదిరిందా…?

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో భారీ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో మహేష్‌ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుందని టాక్ వినిపిస్తుంది. ముందు యాక్షన్ మూవీ చేయాలి అనుకున్నారు కానీ.. ఆఖరికి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఫిక్స్ అయ్యారు. ఈ మూవీ హైదరాబాద్ లో  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక అసలు విషయానికి వస్తే… ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులని రూ.81 కోట్లకి ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబందించిన ఓవర్సీస్ హక్కుల కోసం భారీ డీల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఓవర్సీస్ హక్కులను రూ. 24 కోట్లకు కోట్ చేస్తున్నారట. అయితే.. ఇందులో యుఎస్ఏ హక్కులు రూ. 16 కోట్ల అట. ఇది భారీ మొత్తమని టాలీవుడ్ బిజినెస్ సర్కిల్ లో వినిపిస్తుంది. మొత్తానికి షూటింగ్ కంప్లీట్ కాకుండానే ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండడం విశేషం.

అతడు, ఖలేజా చిత్రాలు తర్వాత మహేష్‌, త్రివిక్రమ్ చేస్తున్న మూవీ కావడంతో భారీగా క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని ఆగష్టు 11న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఆగష్టు 11న విడుదల కావడం లేదని.. దసరాకి విడుదల చేయాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. రిలీజ్ డేట్ పై మేకర్స్ మరోసారి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular