Friday, March 29, 2024
Homeసినిమాసరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్

సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్

అల్లు అర్జున్ ‘పుష్ప‘ సినిమాతో మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన, అలాగే వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంటారు. దీంతో అభిమానులు అయితే.. కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుచుకుంటారు. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎక్కువ మంది ఫాలోయర్స్‌ ఉన్న సౌత్ హీరోగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.

సోషల్ మీడియాలో తన ఆధిపత్యాన్ని చాటుతూ.. ఇప్పటి వరకు ఏ సౌత్ హీరోకి లేని రికార్డ్‌ను బన్నీ సాధించారు. ప్రస్తుతం బన్నీ 20 మిలియన్స్ మెంబర్స్ ఫాలో అవుతున్నారు. రెగ్యులర్‌గా పోస్ట్‌లు చేయకపోయినా.. ఈ మైలురాయిని అందుకున్నాడంటే.. బన్నీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అభిమానులను ఆయన తన ఆర్మీగా పిలుస్తుంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ ‘పుష్ప 2’ చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతోన్న పుష్ప 2 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

కథ పై చాన్నాళ్లు కసరత్తు చేశారు. పుష్ప 2 పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా సుకుమార్ అదిరిపోయే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. పుష్ప 400 కోట్లు కలెక్ట్ చేసింది. మరి.. పుష్ప 2 చిత్రం 1000 కోట్ల మార్క్ ను అందుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది.

Also Read: ఈసారైనా పుష్ప 2 టీజర్ వస్తుందా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్