Tuesday, June 9, 2026
HomeTrending Newsఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ ప్రమాణ స్వీకారం

Swore-in:  నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందిన మేకపాటి విక్రమ్ రెడ్డి శాసనసభ్యునిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ సోమవారం ఉదయం  తమ ఛాంబరులో విక్రమ్  చేత ప్రమాణం చేయించారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసన సభ నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా విధులను నిర్వహించే మేకపాటి గౌతమ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21 న గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన నేపథ్యంలో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు జూన్ 23 న ఆత్మకూరు శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నిక నిర్వహించడం జరిగింది. స్వర్గీయ మేకపాటి గౌతమరెడ్డి సోదరులు మేకపాటి విక్రమ్ రెడ్డి  ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది.  శాసన సభ్యులుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్బంగా శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మేకపాటి విక్రమ్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సోదరులైన స్వర్గీయ మేకపాటి గౌతమ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చుకోవాలని, వారి ఆశయాల సాధనకు, ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్దికి అహర్నిశలు కృషిచేయాలని ఆంకాంక్షించారు.

రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి, మాజీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు  తదితరులు శాసన సభ్యులుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మేకపాటి విక్రమ్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభా కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular