Sunday, January 19, 2025
HomeTrending Newsగ్రీన్ ఇండియా చాలెంజ్ కు ప్రశంసలు

గ్రీన్ ఇండియా చాలెంజ్ కు ప్రశంసలు

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశి థరూర్ కోరారు. హైదరాబాద్ పర్యటనలో బాగంగా శశి థరూర్ నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు శిల్పారామంలో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ని శశిథరూర్ ప్రత్యేకంగా అభినందించారు.గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.హైదరాబాద్ పర్యటన లో బాగంగా పర్యావరణానికి మేలు కలిగించేందుకు మొక్కలు నాటే అవకాశం లభించినందుకు శశిథరూర్ సంతోషం వ్యక్తం చేశారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళ్తుందని ఎంపీలు రంజిత్ రెడ్డి,సయ్యద్ జాఫర్ ఇస్లాం అన్నారు. హైదరాబాద్ పర్యటనలో బాగంగా సహచర ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని సయ్యద్ జాఫర్ ఇస్లాం అన్నారు..సీఎం కేసిఆర్ హరిత హారం స్పూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ ముందుకు వెళుతుందని 16 కోట్లకు పైగా ఇప్పటివరకు మొక్కలు నాటడం జరిగిందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో శశి థరూర్ నేతృత్వంలోని సభ్యులు
మహువ మొయిత్ర – ఎంపీ లోక్ సభ, సయ్యద్ జాఫర్ ఇస్లాం-ఎంపీ రాజ్యసభ..నరేంద్ర జాదవ్, ఎంపీ రాజ్యసభ…సుమతి తమిజిచ్చీ
తంగపాండియన్‌,ఎంపీ లోక్ సభ..,ధైర్యశీల్ సంభజిరావు మానే, ఎంపీ లోక్ సభ..శక్తిసింహ్ గోహిల్,ఎంపీ రాజ్యసభ..నదిముల్ హాక్, ఎంపీ రాజ్యసభ..పి.ఆర్.నటరాజన్ ,ఎంపీ లోక్ సభ..సంతోష్ పాండే,ఎంపీ లోక్ సభ..
గడ్డం రంజిత్ రెడ్డి,ఎంపీ లోక్ సభ..పాల్గొని మొక్కలు నాటారు.

అనంతరం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎంపీ రంజిత్ రెడ్డి,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్