Tuesday, December 3, 2024
Homeసినిమావిజయ్ సినిమాతో దక్కని విజయం!

విజయ్ సినిమాతో దక్కని విజయం!

మీనాక్షి చౌదరి కథానాయికగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతోంది. ఈ నాలుగేళ్లలో ఇక్కడ ఆమె నాలుగే సినిమాలు చేసింది. ‘హిట్ 2’ మినహా ఆమె కెరియర్లో ఇంతవరకూ మరో హిట్ పడలేదు. దాంతో చాలా రోజులుగా ఆమె సరైన హిట్ కోసం వెయిట్ చేస్తూ వెళుతోంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆమె ‘గుంటూరు కారం’ సినిమా చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వం .. మహేశ్ బాబు సరసన ఛాన్స్ .. ఈ సినిమాతో ఆమె కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటి అద్భుతాలేం జరగలేదు.

ఈ నేపథ్యంలోనే విజయ్ సినిమా ‘ది గోట్’లో ఆమె పేరు వినిపించింది. దాంతో అంతా షాక్ అయ్యారు. కాస్త ఆలస్యమైనా ఆమె చాలా పెద్ద ఛాన్స్ కొట్టేసిందని అనుకున్నారు. విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక తెలుగులోను ఆయనకి  మంచి మార్కెట్ ఉంది. ఈ సినిమా హిట్ కొడితే కోలీవుడ్ వైపు నుంచి మరిన్ని ఛాన్సులు వస్తాయనీ, తెలుగులోను తన కెరియర్ పుంజుకుంటుందని ఆమె భావించింది.

కానీ అలా జరగలేదు. ‘ది గోట్’ విషయంలో ఆమె పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఈ సినిమాలో విజయ్ తండ్రీ కొడుకులుగా నటించగా, కొడుకు విజయ్ జోడీగా మీనాక్షి కనిపించింది. ఈ ఇద్దరి మధ్య లవ్ .. రొమాన్స్ .. మాస్ బీట్స్ ఉంటాయని అభిమానులు అనుకోవడం సహజం. అలా అనుకుని థియేటర్ కి వచ్చిన వాళ్లపై దర్శకుడు వెంకట్ ప్రభు నీళ్లు చల్లాడు. సినిమా మొదలైన తరువాత గంటకి వచ్చిన మీనాక్షి, ఆ తరువాత కూడా చేయడానికేమీ లేని పాత్రతో సరిపెట్టుకుంది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న మూడు సినిమాలే ఆమె కెరియర్ ను ముందుకు తీసుకుని వెళ్లవలసి ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్