Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్Hockey Series: రెండో మ్యాచ్ లోనూ ఆసీస్ దే గెలుపు

Hockey Series: రెండో మ్యాచ్ లోనూ ఆసీస్ దే గెలుపు

ఆస్ట్రేలియా –ఇండియా మధ్య జరుగుతోన్న హాకీ సిరీస్ ఓ రెండో మ్యాచ్ లో కూడా భారత జట్టు 7-4 తేడాతో ఓటమి పాలైంది.  రెండు దేశాల పురుషుల హాకీ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్ లోభాగంగా ఇండియా జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో 5-4 తేడాతో ఆతిథ్య జట్టు గెలుపొందింది. నిన్నటి మ్యాచ్ లో చివరి క్షణాల్లో గోల్ చేసి ఆసీస్ కు అద్భుతమైన విజయాన్ని అందించిన గోవేర్స్ బెక్ నేడు హ్యాట్రిక్ గోల్స్ చేయడం విశేషం.

ఆట మూడో నిమిషంలోనే ఇండియా ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా స్కోరు బోణీ చేశాడు. 12వ నిమిషంలో గోవర్స్ పెనాల్టీ కార్నర్ గోల్ చేసి తొలి పావు భాగానికి స్కోరు సమం చేశాడు.  రెండో భాగంలో ఆసీస్ మూడు గోల్స్ చేయగా, ఇండియా ఒక గోల్ మాత్రమే చేయగలిగింది. దీనితో ఆట అర్థ భాగానికి 4-2తో ఆసీస్ ముందంజలో నిలిచింది. మూడో పావు భాగంలో ఇండియా ఒక గోల్ చేసి స్కోరును ­4-3కు చేర్చింది.

కానీ చివరి క్వార్టర్ లో ఆసీస్ పూర్తి పైచేయి సాధించి మూడు గోల్స్ చేయగా, ఆట చివరి క్షణాల్లో ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ మరో గోల్ సాధించాడు. చివరకు 7-4తో ఇండియాపై ఆసీస్ విజయం సొంతం చేసుకుంది.

ఆసీస్ 12,17,24, 27, 48, 49,53 నిమిషాల వద్ద గోల్స్ చేసింది. వీటిలో నాలుగు ఫీల్డ్ గోల్స్, మూడు పెనాల్టీ కార్నర్స్ ఉన్నాయి.

ఇండియా 3, 25, 36, 60 నిమిషాల వద్ద …. మూడు పెనాల్టీ కార్నర్స్, ఒక ఫీల్డ్ గోల్ చేయగలిగింది.

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

మూడో మ్యాచ్ నవంబర్ 30న జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular