Saturday, April 20, 2024
Homeసినిమా7న 'మీటర్' టీజర్ విడుదల

7న ‘మీటర్’ టీజర్ విడుదల

కిరణ్‌ అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్‌కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీటర్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్‌ కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏప్రిల్ 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ని ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ….‘‘కిరణ్ అబ్బవరం కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ఇది. ఆయనలోని  కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దాడు. కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ కనిపిస్తాడు. ఆయన లుక్ కొత్తగా వుంటుంది అన్నారు. అతుల్య రవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో సక్సెస్ సాధించిన కిరణ్‌ కు ఈ సినిమా మరో విజయాన్ని అందిస్తుంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్