Saturday, January 18, 2025
HomeTrending Newsకాన్పూర్ లో మెట్రోరైలు ప్రారంభం

కాన్పూర్ లో మెట్రోరైలు ప్రారంభం

Metro Train Launched In Kanpur :

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ రోజు మెట్రో రైలు ప్రారంభించారు. 11 వేల కోట్ల రూపాయల అంచనాతో మొత్తం 32 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం 9 కి. మీ నిడివి గల మార్గం IIT క్యాంపస్ నుంచి మోతీజీల్ వరకు పూర్తి అయింది.

ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాత్, కేంద్రమంత్రి హర్దిప్ సింగ్ పూరి తదితరులు మెట్రోలో ప్రయాణించారు.

రికార్డు స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ మెట్రో దేశంలోనే అత్యంత వేగంగా నిర్మించిన మెట్రో ప్రాజెక్ట్‌గా అవతరిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు నవంబర్ 15, 2019న శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ఈ కారిడార్‌లో నవంబర్ 10, 2021న రెండేళ్లలోపే ట్రయల్ రన్ జరిగటం విశేషం.

అంతకుముందు కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 54వ (ఐఐటి కాన్పూర్) స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

Also Read :  ఆరోగ్య రంగంలో కేర‌ళ ప్ర‌థ‌మ స్థానం

RELATED ARTICLES

Most Popular

న్యూస్