Friday, March 13, 2026
HomeTrending Newsమెక్సికోలో జైలుపై దుండగుల దాడి

మెక్సికోలో జైలుపై దుండగుల దాడి

మెక్సికోలోని ఓ జైలుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. వారు జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మెక్సికో సరిహద్దు నగరమైన జువారెజ్‌లో ఉన్న సెంట్రల్‌ జైలుపై సాయుధులైన గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 14 మంది అక్కడికక్కడే మరణించారు. వారిలో 10 మంది భద్రతా సిబ్బంది, నలుగురు ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఎస్‌యూవీల్లో వచ్చిన దుండగులు ఒక్కసారిగా జైలు సెక్కూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారని, జైలులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం, స్థానిక పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని చెప్పారు. అయితే దుండగుల కాల్పుల్లో భద్రతా సిబ్బందితోపాటు నలుగురు ఖైదీలు చనిపోయారని, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా 24 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు గుర్తించామన్నారు. ఈ దాడికి పాల్పడింది ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోను ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular