Friday, March 29, 2024
Homeసినిమా`లైగర్` డబ్బింగ్ పూర్తిచేసిన మైక్ టైసన్

`లైగర్` డబ్బింగ్ పూర్తిచేసిన మైక్ టైసన్

Tyson- dubbing: పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం లైగ‌ర్. ఈ భారీ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో ప్రపంచ బాక్సర్ మైక్ టైసన్ భారతీయ సినిమాలోకి అడుగుపెట్టారు. యుఎస్ఎలో విజయ్ దేవరకొండతో పాటు మైక్ టైసన్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే.

తాజాగా  మైక్ టైసన్ ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు.“నా పట్ల  ఇంత ప్రేమ‌ చూపినందుకు చాలా ధన్యవాదాలు. నేను చాలా కృతజ్ఞుడను ”అని మైక్ టైసన్ ఒక వీడియోలో తెలిపారు. మైక్ టైసన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు. అతనిపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రధాన హైలైట్ గా ఉంటాయి. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ ను కలిసి తెరపై చూడటం అభిమానులకు పండగే. పెద్ద స్క్రీన్ ల పై నిజమైన యాక్షన్ ని చూసేందుకు సినీ ప్రియులు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు.

పూరీ కనెక్ట్స్ తో కలిసి, ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. థాయ్లాండ్ కు చెందిన కేచా స్టంట్ డైరెక్టర్ గా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ ని నిర్వహిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 2022 ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్