Saturday, April 20, 2024
Homeసినిమాగ‌నిలో ‘కొడ్తా’ అంటున్న మిల్కీబ్యూటీ

గ‌నిలో ‘కొడ్తా’ అంటున్న మిల్కీబ్యూటీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా గ‌ని. ఈ చిత్రానికి కిర‌ణ్ కొర్రపాటి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యాన‌ర్స్ పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి అయితే… క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం అవ్వ‌డం వ‌ల‌న వాయిదా ప‌డింది.

ఈ సినిమాలో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా  ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా ‘కొడ్తే’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ను విడుదల చేశారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థ‌మ‌న్ అందించిన ఈ మాస్ ఐటెం నెంబర్ అలరిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ  సినిమా లోని ఈ ఐటెం సాంగ్ కూడా బాక్సింగ్ రింగ్ లో  సాగుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ బాగా ఆకట్టుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్