Sunday, November 24, 2024
HomeTrending Newsగ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

విశాఖపట్నం నగరం మరో కీలక సదస్సుకు ముస్తాబవుతోంది. మార్చి3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు నగరం ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర  పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.  మనదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుప్రసిద్ధ కంపెనీల ప్రతినిధులు ఈ సద్సస్సులో పాల్గొంటున్నారు.

దేశంలోనే రెండో అతిపెద్ద స‌ముద్ర తీర ప్రాంతం కలిగి ఉంది, సహజ వనరులు అపారంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులకు  ఉన్న అవకాశాలను వివరించి పలు కంపెనీలను ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చూడడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ప‌రిశ్ర‌మ‌ల కోసం 26 వేల నుంచి 30 వేల ఎక‌రాల భూములు ఇప్ప‌టికే అందుబాటులో ఉన్నాయని, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ప్ర‌భుత్వం నుంచి అందే స‌హ‌కారాన్ని పారిశ్రామిక వేత్త‌ల‌కు వివ‌రించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. – పున‌రుత్పాద‌క విద్యుత్‌కు సంబంధించి ఎక్కువ పెట్టుబ‌డులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్