Saturday, January 18, 2025
HomeTrending Newsవ్యక్తిగత దూషణ మానుకో లోకేష్: అవంతి

వ్యక్తిగత దూషణ మానుకో లోకేష్: అవంతి

గుంటూరులో  బి.టెక్.  విద్యార్ధిని రమ్య  కత్తిపోట్లకు గురై మరణిస్తే ఆ సంఘటనను కూడా టిడిపి నేత లోకేష్ రాజకీయం చేయడం నీచమని రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఏదో  యుద్ధంలో గెలిచినట్టు ఆ  చేష్టలేమిటని ప్రశ్నించారు. పెళ్ళికీ, చావుకీ ఒకే మంత్రం వేస్తే ఏమవుతుందో తెలుసుకోవాలని  అవంతి హితవు పలికారు.

ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి చేసిన వ్యాఖ్యలు

  • గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
  • ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థినిని ఈ విధంగా హత్య చేయడం చాలా బాధాకరం.
  • దిశ యాప్ ను ప్రతి ఒక్క మహిళ, యువతి డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • మహిళలపై అఘాయిత్యాలకు  పాల్పడితే.. ఈ ప్రభుత్వం ఏ కులమైనా, మతమైనా, ఎవర్నీ ఉపేక్షించదు.
  • పనిలేని ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు కుమారుడుగా తప్పితే.. ఏ అర్హతా లేని లోకేష్ ఈ మధ్య వెయిట్ తో పాటు విచక్షణ కూడా కోల్పోయి ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.
  • రమ్యను కోల్పోయి వారి కుటుంబం బాధలో ఉంటే.. ఓదార్చాల్సిందిపోయి, గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళకుండా అడ్డుకోవడం, పోలీసులపై  టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం బాధాకరం.
  • ముఖ్యమంత్రి జగన్ గారిని వ్యక్తిగతంగా దూషించినంత మాత్రాన జీరోగా ఉన్న లోకేష్ ఎప్పటికీ హీరో కాలేడు అన్నది గుర్తుంచుకోవాలి
  • లోకేష్ గ్రామ స్థాయి నాయకుడి కంటే హీనంగా మాట్లాడుతున్నాడు. అమెరికాలో చదివిన లోకేష్.. ఇటువంటి భాషను మాట్లాడటం ఎంతవరకు సబబో తనకు తానే ఆత్మ విమర్శ చేసుకోవాలి.
  • ముఖ్యమంత్రిగారిని ప్రస్తావిస్తూ.. వ్యక్తిగతంగా దూషణలు చేయడం లోకేష్ మానుకోవాలి. లోకేష్ వచ్చిన తర్వాతే.. రాజకీయాల్లో ఇటువంటి బూతుల ట్రెండ్ ను కొత్త ట్రెండ్ గా తెచ్చాడు.
  • యుద్ధంలో జయించిన హీరో మాదిరిగా నిన్న రమ్య కుటుంబ సభ్యుల పరామర్శకు వెళ్ళిన లోకేష్.. నుదుటున పెద్ద బొట్టుపెట్టుకుని, కారు దగ్గర పిడికిలి బిగించి చూపిస్తూ సంకేతాలు ఇస్తూ, పోలీసులపై దౌర్జన్యం చేస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటి…?
  • ప్రతిదాన్నీ టీడీపీ  రాజకీయం చేయాలని చూడటం తగదు. దళితుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకిగానీ, లోకేష్ కు గానీ లేదు.
  • దళితులు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి ఆత్మ లాంటి వారు. ఇకనైనా టీడీపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ను మానుకుంటే మంచిది.
  • ప్రతిదానికీ కులాన్ని ముడిపెట్టి, కుల రాజకీయాలు చేయటం మానాలి.
  • రమ్య హత్య ఘటనలో…  ప్రభుత్వంగానీ, పోలీసుల నిర్లక్ష్యంగానీ ఉంటే.. దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.
  • అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటన.
  • రమ్య దారుణ హత్యను.. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన బాధ్యత సమాజంలో అందరిపైనా ఉంది.

అంటూ మంత్రి అవంతి వ్యాఖ్యానించారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్