నేడు కులగణన జరుగుతుంటే టీడీపీకి కూసాలు కదిలిపోతున్నాయని, ఆ పార్టీ బీసీల మనోభావాలను ఎప్పుడూ అర్ధం చేసుకోలేదని, కేవలం బీసీలను ఓట్ల యంత్రాలుగా చూశారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ విమర్శించారు. బాబు హయాంలో తామంతా మోసపోయామని బీసీలు తెలుసుకున్నారన్నారు. రామచంద్రాపురంలోని తన క్యాంపు క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. నిన్న తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన పుస్తకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసి గణన పై ఓ పత్రికలో వచ్చిన కథనంపై కూడా ఆయన మండిపడ్డారు.
వేణుగోపాల కృష్ణ మాట్లాడిన ముఖ్యాంశాలు:
⦿ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చైతన్యవంతులయ్యారు.
⦿ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు ఈ వర్గాల జీవన ప్రమాణాలు పెరగకుండా చేశాడు.
⦿ పేద వాడి ఆశలు నెరవేరక, తన ఆత్మగౌరవాన్ని మీలాంటి పెత్తందారుల వద్ద తాకట్టు పెట్టి జీవించే స్థితి నుంచి నేడు మార్పు వచ్చింది.
⦿ ప్రముఖ పత్రిక అని చెప్పుకుంటూ నిత్యం ప్రజలను తన రోత రాతలతో ఏమార్చాలని, ఒక అబద్ధానికి మద్దతు పలకాలని ఈనాడు ప్రయత్నం చేస్తోంది.
⦿ పథకాల రద్దుకే బీసీల కులగణన అంటూ ఈ రోజు ఒక వార్త రాశారు.
⦿ రామోజీరావు..మీరు ఆనాడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించడం కోసం ఎన్ని రోత రాతలు రాశావో ప్రజలకు తెలుసు.
⦿ ఒక పెద్ద అబద్ధాన్ని ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. అబద్ధానికి, కుట్రకు, కుతంత్రానికి ఒక రూపం చంద్రబాబు.
⦿ మీ రోత రాతలతో ఆనాడు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశారు. చంద్రబాబు మీ కోసం, రాధాకృష్ణ లాంటి వారి కోసం ముఖ్యమంత్రి అయ్యాడు.
⦿ భారత దేశ వ్యాప్తంగా కులగణన జరగాలని అనేక చోట్ల డిమాండ్లున్నాయి.
⦿ టీడీపీ వారు ఆరు సార్లు కేంద్రానికి పంపారట..చెయ్యాలనే చిత్తశుద్ది లేని వారి మాటలు ఇలానే ఉంటాయి.
⦿ మేం 2021 నవంబర్‌లో జరిగిన శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేసి జనగణనలో కులగణన చేయించాలని కోరాం.
⦿ మేం చేసే కులగణనకు చట్టబద్ధత లేదని చెప్పడం కంటే పెద్ద అబద్ధం ఏముంది?
⦿ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆ అధికారం ఇచ్చింది..అందుకే బీహార్‌లో కులగణన జరిగింది.
⦿ వాటన్నిటినీ పరిశీలించి కులగణన చేయడానికి మేం నిర్ణయించుకున్నాం.
⦿ దీంతో మీకు కూసాలు కదిలిపోతున్నాయి. మీ కుట్రలు బయటపడి పోతున్నాయి.
⦿ మీరు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మరనే మీరు ఇలా భయపడి పోతున్నారు.
⦿ కులగణన ఒక చారిత్రక నిర్ణయం.రామ్మనోహర్ లోహియా లాంటి వారు దీని గురించి పోరాడారు.
⦿ ఆయా వర్గాలకు సంక్షేమాన్ని అందించడంతో పాటు వారి ఆకాంక్షలు తీర్చే ప్రభుత్వంగా జగన్ గారి ప్రభుత్వం నిలుస్తోంది.
⦿ బడుగు బలహీనవర్గాల చైతన్యంతో జగన్ గారికి బ్రహ్మరథం పడుతుంటే…టీడీపీ కుప్పకూలిపోతోంది.