Wednesday, March 18, 2026
HomeTrending Newsప్రీతి దోషులను కఠినంగా శిక్షిస్తాం - మంత్రి ఎర్రబెల్లి

ప్రీతి దోషులను కఠినంగా శిక్షిస్తాం – మంత్రి ఎర్రబెల్లి

సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరం. ఎవరూ పూడ్చలేని దుఖం లో ఆ కుటుంబం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.

అలాగే ప్రీతి ఘటన పై విచారణ కొనసాగుతున్నదని, ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా… సరే చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ప్రీతి ఆత్మ శాంతించాలని ఆ దేవుడిని మంత్రి ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

Also Read : మెడికో ప్రీతి కన్నుమూత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular