Monday, June 17, 2024
Homeసినిమా'ప్రాజెక్ట్ కే' పై క్లారిటీ ఇచ్చిన అశ్వనీదత్

‘ప్రాజెక్ట్ కే’ పై క్లారిటీ ఇచ్చిన అశ్వనీదత్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే.  దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో, సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే.. కీలక పాత్రలో అమితాబ్ నటిస్తుండడం విశేషం.

ఆదిత్య 369 త‌ర‌హాలో సోషియో ఫాంట‌సీ ట‌చ్ ఉన్న సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. హాలీవుడ్ ప్ర‌మాణాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని విధంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను 2024, జ‌న‌వ‌రి 12న  విడుద‌ల‌ చేస్తామని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే..  ప్ర‌భాస్ ఒకేసారి ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్న నేప‌థ్యంలో…ఇంత భారీ చిత్రం నిజంగా అనౌన్స్ చేసిన డేట్ కి  ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందా అన్న సందేహాలున్నాయి కానీ.. ఈ విష‌యంమై అశ్వనీద‌త్ క్లారిటీ ఇచ్చారు. ఇప్ప‌టికే ఈ మూవీ 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్లు తెలియచేశారు.

ఇంకా విడుద‌ల‌కు ప‌ది నెల‌ల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇంకో 30 శాతం చిత్రీక‌ర‌ణ‌.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, ప్ర‌మోష‌న్‌కు స‌మ‌యం  సరిపోతుందని, వీఎఫెక్స్ వర్క్ ఐదారు స్టూడియోల్లో జ‌రుగుతున్నాయ‌ని.. ఆ ఎఫెక్ట్స్ తెర‌ పై చూసిన‌పుడు న‌భూతో న‌భవిష్య‌తి అన్న‌ట్లుగా ఉంటాయ‌ని అశ్వనీద‌త్ చెప్పారు. ప్రేక్ష‌కులు ఇప్పటిదా చూడ‌ని స‌రికొత్త అనుభూతిని ప్రాజెక్ట్‌-కే చూస్త‌న్న‌పుడు పొందుతార‌ని అన్నారు. ఇది  సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్లో తెర‌కెక్కినప్పటికీ.. ఎమోష‌న్లు, సెంటిమెంట్ కూడా బలంగా ఉంటాయని సమాచారం.

Also Read : ‘ప్రాజెక్ట్ కే’ స్టోరీ ఇదే

RELATED ARTICLES

Most Popular

న్యూస్