Sunday, November 3, 2024
HomeTrending Newsనిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ సవాల్

నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ సవాల్

కేంద్ర ఆర్థిక మంత్రి , ప్రధాని ఫోటో రేషన్ షాపులో పెట్టమని చెప్పడం హస్యాస్పదమని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో ఈ రోజు మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎంతో మంది ప్రధానులు వచ్చారు. రేషన్ షాపులో ఫోటోలు పెట్టలేదు. గత చరిత్రలో లేని విధంగా తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా కేంద్ర మంత్రులు ప్రవర్తిస్తున్నారని నిర్మలాసీతారామన్ వాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

హరీష్ రావు ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు….

మొత్తం రేషన్ బియ్యం వాళ్లు ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నరు. రాష్ట్రంలో మీరు ఇచ్చేది 55 శాతం మాత్రమే. అది మూడు రూపాయలకు ఇస్తరు. అందులో రెండు రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 45 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి లబ్ధిదారుడికి పది కేజీల బియ్యం ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 3610 కోట్లు రేషన్ బియ్యం కోసం ఖర్చు చేస్తున్నం. అలా అని సీఎం ఫోటో పెట్టామంటారా…

దేశాన్ని సాధే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని సీఎం చెబుతారు. చాలా రాష్ట్రాలు పేద రాష్ట్రాలు. తెలంగాణ నుండి దాదాపు లక్షా 70 వేల కోట్లు అదనంగా ఇచ్చినం. తెలంగాణ నుంచి పోయిన డబ్బులు ఇతర రాష్ట్రాలకు, కేంద్రానికి వెళుతుంది. మరి కేసీఆర్ ఫోటో పెడతారా… 3 లక్షల 65 వేల 797 కోట్లు కేంద్రానికి పోయింది. కాని కేంద్రం నుండి రాష్ట్రానిక వచ్చింది1 లక్షా 96 వేల 400 కోట్లు మాత్రమే వచ్చింది. కేంద్రంకు రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ. రాష్ట్రానికి వచ్చింది తక్కువ. దేశాన్ని, ఇతర రాష్ట్రాల ను సాధడంలో తెలంగాణ ప్రజల సంపద, తెలంగాణ ప్రభుత్వ వాటా ఉంది. మరి తెలంగాణ ప్రతినిధిగా సీఎం కేసీఆర్ ఫోటో పెడతారా..

మీరు మాట్లాడేది అర్థ సత్యాలు….మేం మాట్లాడేది నగ్న సత్యాలు. ఈ మధ్య కేంద్రం నుంచి వస్తోన్న మంత్రులు అబద్దాలు మాట్లాడుతున్నారు. నోరువిప్పితే అబద్ధాలే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం పారలేదు. అంటరు. మెదక్ జిల్లాలో ఎన్ని ఎకరాలు పారుతోందో మీకు తెలియదా.. కాళేశ్వరంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అయింది.

మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం తెలంగాణ గ్రోత్ ఇంజన్ అని అంటరు.. మేమే అనుమతులు ఇచ్చినం అంటరు. ఒక్క ఎకరా పారలేదని అమిత్ షా మాట్లాడతరు. ఇన్ని పచ్చి అబద్దాలా..రైతులు మీరు మాట్లాడే మాటలు విని ఎమనుకోవాలి. జాతీయ స్థాయి నేతలు రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి అబద్దాలు మాట్లాడతరా..ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం కాదా..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అంటడు.. జైలు కూలగొట్టిండ్రు..హల్త్ సిటీ ఏదన్నడు..నేను ఫోటోలు పెట్టాం. మళ్లీ మాట్లాడితే ఒట్టు. దానికి సమాధానం లేదు. నాలుగేళ్ల క్రితం ఎయిమ్స్ ఇస్తే తట్టెడు మట్టి ఎత్తలేదు. మేం హెల్త్ సిటీ పనులు 15 శాతం చేశాం. మూడు సార్లు నేను వెళ్లి సమీక్ష చేసా..దిగజారుడు రాజకీయాలు. పట్టపగలు పచ్చి అబద్దాలు మాట్లాడే పార్టీ బీజేపీ

ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయని ఆయుష్మాన్ భారత్ లో చేరలేదని నిర్మలా సీతారామన్ అన్నరు. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరలేదంటే నేను వెంటనే రాజీనామా చేస్తా..లేదంటే మీరు చేస్తరా..
4 ఫిబ్రవరి 2022 లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న వేశారు. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరిందా లేదని అంటే మే 2018 లో చేరిందని చెప్పారు . ఇది లోక్ సభలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిన మాటలు. అదే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే ఆయుష్మాన్ భారత్ లో చేరలేదని పచ్చి అబద్దం ఆడేశారు. ఒక కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చేరిందని అంటరు.. ఇంకో కేంద్ర మంత్రి చేరలేదని గల్లీలో అబద్ధాల ఆడుతరు.

ఆయుష్మాన్ భారత్ 2021-22 లో తెలంగాణకు 150 కోట్లు మంజూరు చేసింది. ఆయుష్మాన్ భారత్ కంటే మంచి పథకం తెలంగాణలో ఉంది. 26 లక్షల కుటుంబాలకు మాత్రమే ఆయుష్మాన్ భారత్ కింద లబ్ది, తెలంగాణలో ఆరోగ్య శ్రీ కింద 90 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతున్నం. 858 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసినం. మీరు ఇచ్చింది 150 కోట్లు. మేం ఆయుష్మాన్ భారత్ కింద ఎందుకు 150 కోట్లు విడుదల చేసిండ్రో…ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వాలి. చేరలేదంటే నేను రాజీనామాకు సిద్దం. లేదంటే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి తమ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరం 505 కోట్లు ఆరోగ్య శ్రీ ఆయుష్మాన్ భారత్ కింద ఖర్చు అయితే ఫస్ట్ క్వాటర్ కింద 40 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది.

గోబెల్స్ ను మించి పోయి అబద్దాలు మాట్లాడుతున్నరు. మీరిచ్చేది 26 శాతం మందికే,మేం ఇచ్చేది 90 శాతం మందికి వైద్య సేవలు ఆరోగ్య శ్రీ ద్వారా ఇస్తున్నం. మీరు ఇచ్చేది తక్కువ. ఆర్బాటం ఎక్కువ. ఆరోగ్య శ్రీ కింద పది లక్షలు దాకా ఇస్తున్నం. అలాంటింది మీదగ్గర ఉందా పథకం.మీరు ఇచ్చేది 150 కోట్లు ఇచ్చి ఫోటో పెట్టాలంట. మేం 859 కోట్లు ఖర్చు చేస్తున్నం. ఇది కేంద్ర ప్రభుత్వంతో ఆయుష్మాన్ భారత్ చేరుతూ అగ్రిమెంట్ కూడా చూపిస్తున్నం. 18 మే 2021 లో చేరినట్లు అగ్రిమెంట్.

అబద్దాల మంత్రుల లిస్ట్ లో నిర్మలా సీతారామన్ కూడా చేరిపోయారు. మేం ఇంత చేసినం అంటున్నరు ఏం చేసిండ్రు చెప్పాలి. బీజేపీ వచ్చిన తర్వాత దేశం మొత్తం దివాళా తీసింది. కేంద్రం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రాల మీద బురద జల్లుతోంది. మీరు చేసిన బెస్ట్ కార్యక్రమాలు ఏంటి.

ఘనత నెంబర్ వన్ ఏంటంటే 2022 లో వరల్డ్ హంగర్ ఇండెక్స్ లో భారత దేశం 101 స్థానంలో ఉంది. బీజేపీ రాకముందు 2014 లో 55 స్థానంలో ఉంది. 8 ఏళ్ల పాలనలో బీజేపీ పుణ్యమాని 101 స్థానంలో

పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కన్నా పేదరికంలో ఉండేవి. ఇవాళ మన దేశమే పేదరికంలో ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదరికంలో మనం కిందకు వెళ్లాం.

ఘనత నెంబర్ 2 – 2014లో బీజేపీ రాకముందు నిరుద్యోగిత 4.9 శాతం 11 శాతానికి పెరిగింది. ఇది కేంద్రం సాధించిన ఘనత నెంబర్ 2

ఘనత నెంబర్ 3- ఒక మహిళనే దేశానికి ఆర్థిక మంత్రి ఉన్నరు. మహిళలు ఆశిస్తరు మహిళా మంత్రి నుంచి. కాని ఒక మహిళా మంత్రిగా ఉండి దేశంలోని మహిళల కళ్లల్లో కన్నీరు తెప్పించిన ఘనత మీది. అచ్చే దిన్ అచ్చే దిన్ అన్నరు..పోయిల కట్టేల దిన్ వచ్చింది. దీని కోసం మాట్లాడండి నిర్మలా సీతారామన్… మా గొప్ప తనం 400 సిలిండర్ ధర 1200 కు పెంచినమనని చెప్పుకోండి

ఘనత నెంబర్ 4 – రైతుల ఆదాయం రెట్టింపు చేస్తమన్నరు.. ఆదాయం రెట్టింపు కాలేదు కాని, పెట్టుబడి పెంచిన ఘనత మీది. 73 రూపాలు పెట్రోల్ ఉండే ధర 100 రూపాయలకు పెరిగింది. పెట్రోల్ డిజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిండ్రు. ఇది మీ ఘనత నెంబర్ 4

ఘనత నెంబర్ -5 – ప్రపంచ దేశాల ముందు రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతుంది. 2014లో డాలర్ కు 63 ఉండే ఇవాళ 83కు పడిపోయింది. ఇది అద్భుతమైన పరిపాలనకు ఇది నిదర్శనం. మీరుఅద్భుతంగా పాలించి ఉంటే ఎందుకు రూపాయి ధర పతనమైందో చెప్పాలి. భారత దేశలో చరిత్రలో ఇంత దారుణంగా రూపాయి విలువ పడిపోలేదు.

ప్రపంచంలో సగటు పౌరడు తలసరి ఆదాయం స్థానం చూస్తే మన దేశం 144 స్థానంలోకి పడిపోయింది. అదాని మాత్రమే ప్రపంచంలో మూడో స్థానంలో కుబెరుడిగా మారాడు. ఇది వాస్తవం. తెలంగాణలో అభివృద్ధి జకరగలేదు.పరిపాలన బాాగాలేదు. అప్పుల పాలయింది. అని ఇష్టారీతిన మాట్లాడారు.

ఏ రంగంలో అయినా దేశ సగటు కన్నా తెలంగాణ రాష్ట్ర సగటు అన్ని రంగాల్లో ముందుంది.. రెండు లక్షల 78 వేల 823 రూాపాయలు. దేశ తలసరి ఆదాయం లక్షా 49 వేలు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ ఆదాయం ఎక్కువ. ఏ సూచికలో చూసినా దేశ సగటు కన్నా తెలంగాణ మెరుగు. ఇది నిజం ఇది వాస్తవాలు. దీన్ని మీరు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నరు.

తెలంగాణ లో అప్పులు బాగా పెరిగినయి. అంటున్నరు. పార్లమెంట్ లో నిర్మలా గారే ఆర్బీఐ లెక్కలు చెప్పారు. డెట్ టూ , జీఎస్డీపీ రేషియోలో తెలంగాణ 23.5 శాతం మాత్రమే. లిమిట్ లో ఉందని చెప్పారు. నవంబర్ 30, 2021 నాడు ఈ లెక్కలు చెప్పింది. పంజాబ్ 42, హిమచల్ ప్రదేశ్ 38, వెస్ట్ బెంగాల్ 36.9, ఉత్తరప ్రదేశ్ 36.6, గోవా 33.3,బీహార్ 32.6 శాతం ఉంది. కాని తెలంగాణ 23.5 శాతం ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు

తెలంగాణ పౌరుడు లక్షా 20 వేల అప్పు అని అర్థ సత్యం చెప్పింది. కేంద్ర లెక్ 89 వేల 188 రూపాయల అప్పు కలిగి ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం 1 కోటి 52 లక్షల 17 వేల 910 కోట్లు అప్పు చేసింది. కేంద్ర అప్పు లక్షా 22 వేల అప్పు పౌరుల మీద వేసిండ్రు.

కేంద్రం 2014 లో నికరఅప్పు 62 లక్షల 42 వేల కోట్లు ఇవాళ అప్పు ఒక లక్షా 35 వేల 866 వేల లక్షా 52 వేల కోట్లకు పెరుగుతుందని మొన్న బడ్జెట్ లో చెప్పారు. మీరుఅప్పులు పెంచారు. డెట్ ,జీడీపీ రేషియో చూస్తే మీది 57 శాతం. మీరు 57 శాతం అప్పులు తెచ్చుకుంటే ఒప్పు..మేం అప్పులు తెచ్చుకుంటే తప్పా.. ఇక్కడ పనలు జరగవద్దు.

మేం కొత్త రాష్ట్రం కనుక, నీళ్లు తెచ్చుకోవాలి కనుక అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టాం. నీళ్లు ఇస్తూ బంగారం లాంటి పంటలు పండిస్తున్నం. కూలీలు చత్తీస్ ఘడ్, బీహార్ నుండి కూలీలు తెస్తున్నం. కాంటా వేయాలంటే పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నరు. రైతు బంధు,మిషన్ కాకతీయ, 24 గంటల ఉచితవిద్యుత్ వల్లే కదా ఇంత పంట పండుతుంది. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారింది కదా దీన్ని కాదంటరా..

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరిగాయని చెబుతారు. పార్లమెంట్ లో ఓ మాట..ఢిల్లీలో.. ఓమాట..గల్లీలో ఓమాట.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్ లో 2014లో 898 మంది రైతులు చనిపోతే 2020లో 466 మంది చనిపోయారు. తెలంగాణలో సగానికి సగం తగ్గాయని తోమర్ గారు చెప్పారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి గల్లీలో ఆత్మహత్యలు పెరిగాయని చెప్తరు. మీ కార్యకర్తల చప్పట్లు కోసం అబద్దాలు మట్లాడటం తగునా… ఏది కరెక్ట్.. ఎవరి మాట నిజం. ఈ రకంగా మాట్లాడవచ్చునా..

కేంద్ర పథకాలు పేర్లు మార్చి ప్రచారం చేసామని అంటరు. ఏ ప థకం మార్చినం. మీరు మాయి కాపీ కొట్టారు. రైతు బంధు కేంద్రం పెట్టిందా..రాష్ట్రం పెట్టిందా…ప్రతీ రైతుకు…ప్రతీ ఎకరానికి పది వేలు రూపాయలు ఇస్తున్నం. ఇందులో పైసా మీది ఉందా…మేం పేర్ల మార్చి ప్రచారం చేసుకుంటున్నమని మీరు చెబుతున్నరు. రైతు బందు కేసీఆర్ ఆత్మ నుండి పుట్టింది. రైతు బీమా ఇందులో మీది ఒక్క రూపాయి ఉందా..

24 గంటల ఉచిత విద్యుత్ మేం కాపీ కొట్టినమా… ఏ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన రాష్ట్రం ఉందా…బాన్సూవాడలో తిరుగుతున్నరు కదా రైతును అడగండి నిర్మల గారు. రైతు బందు, రైతు బీమా ఎలా వస్తుందో అడగండి.

కేంద్ర మంత్రిగా రేపటి బడ్జెట్ లో 24 గంటల ఉచితవిద్యుత్ ఇవ్వండి. రైతు బంధు ఇవ్వండి..రైతు బీమాఇవ్వండి..బాన్సువాడలో కారు దిగి రైతను పలకరించండి. వడ్లు ఎలా కొన్నమో…రైతు బందు ఎలా ఇచ్చినమో…5 లక్షల బీమాఎలా ఇచ్చినమోఅడంగండి రైతులు చెబుతరా. అలాంటి పథకాలు దేశంలోపెట్టండి..సంతోషం.

2016 ఆసరా పెన్షన్ పేరు మార్చినమా..షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి లో మీది ఒక్క రూపాయిఉందా. కేసీఆర్ కిట్ లో మీ భాగస్వామ్యం ఉందా.. ఎందుకు మీ స్థాయి తగ్గించుకుంటున్నరు. కేంద్ర పథకాలు మేం ప్రచారం చేసుకుంటున్నమట..కర్ణాటక పోదాం పద..మీ కేంద్రమే డబ్బులు ఇస్తే…కర్ణాటకలో రైతు బీమా ఉందా…2016 పెన్షన్ ఉందా..కళ్యాణ లక్ష్మి ఉందా..రైతు బీమా ఉందా..ఉచితవిద్యుత్ ఉందా… మహరాష్ట్ర పోదామా…మీ పథకాలు అయితే అన్నిరాష్ట్రాల్లో అమలు కావాలి కాదా..

అసలు నిజం రైతు బంధును మీరు సగం కాపీ కొట్టి ఎకరానిక ఆరువేలే ఇచ్చి కొందరికే ఇస్తున్నరు. మేం అందరికీ ఇచ్చినం. ప్రతీ ఎకరానికి పదివేలు ఇచ్చినం. కిసాన్ సమ్మాన్ యోజన అని పేరు పెట్టుకున్నరు. రైతు బంధును కాపీ కొట్టి. మిషన్ భగీరథ ప్రధాని వచ్చి స్వయాన నల్లా ఇప్పారు గజ్వేల్ లో. అది తెలంగాణ నిధులతో చేసింది. మీరు హర్ ఘర్ కో జల్ అని మీరే కాపీ కొట్ట్రిండ్రు. కళ్యాణ లక్ష్మిని మీరు కాపీకొట్టిండ్రు.. అర్థ సత్యాలు. అవాస్తవాలు మీవి…

మన ఊరు- మన బడి కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకుంటుంది. ఇంత పచ్చి అబద్జాలు మాట్లాడితే ఎలా.. ఇవాళ రాష్ట్రం సర్ ప్లస్ నుండి డెఫిసిట్ కు పోయిందని చెప్పారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ ఎందుకు లోటు 22 వేల 548 కోట్లు ఉంది. కర్ణాటక 19 వేల 338 కోట్ల లోటు బడ్జెట్. కేంద్రం ఎప్పుడూలోటు బడ్జెట్. మీరే కేంద్ర ఆర్థిక మంత్రి, 8ఏళ్లలో మీరు ఎప్పుడు సర్ ప్లస్ బడ్జెట్ ఉంది. మీరుఅప్పుల దేశంగా మార్చారని అనలేమా…కరోనా వచ్చి మీరే ఆర్థిక వ్యవస్త దెబ్బ తినకూడదని అప్పులు తీసుకోమన్నరు. డిస్క్ం ల అప్పులు రాష్ట్రాల మీద వేసిండ్రు.

ఫసల్ బీమా అమలు కావడంలేదని అడిగారు నిర్మలా సీతారామన్. ప్రదాని స్వంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు కావడం లేదో ముందు సమాధానం చెప్పి, మమ్ముల్ని అడగాలి. అది దండగ, రైతులకు మేలు జరగదని గుజరాత్ రాష్ట్రమే తిరస్కరించింది. కట్టేది ఎక్కువ…వచ్చేది తక్కువ అని. దీని సమాధానం ఇవ్వాలి.

నేను ప్రతీప్రశ్నకు ఆన్సర్ ఇచ్చా…నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వమనండి. నిర్మలా సీతారామన్ ని. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నరు. తెలంగాణకు కేంద్ర మంత్రులు రావడం అబద్దాలు మాట్లాడటం. పార్లమెంట్ లోనిజాయితీగా చెప్తరు. గల్లీలో అబద్దాలు మాట్లాడతరు. స్థాయిని దిగజార్చుకోని మాట్లవద్దని నా సూచన.

Also Read : కేంద్రంలోని బీజేపీవి మాటలే  హరీశ్‌రావు

RELATED ARTICLES

Most Popular

న్యూస్