Thursday, April 18, 2024
HomeTrending Newsకేంద్రంలోని బీజేపీవి మాటలే... హరీశ్‌రావు

కేంద్రంలోని బీజేపీవి మాటలే… హరీశ్‌రావు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాటలే తప్ప పనులు చేయదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రజా సంక్షేమం పట్టించుకోని బిజెపి నేతలు…  తెరాస ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో 10.50 కోట్ల మంది గిరిజన జనాభా ఉంటే కేంద్రం బడ్జెట్ లో పెట్టింది కేవలం 0.02% శాతమని మంత్రి విమర్శించారు. నిజాంపేటలో తెలంగాణ ఎరుకల ఆత్మగౌరవ భవనానికి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరం కలిసి ఉంటే.. సీఎం కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్లి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
రూ.2కోట్లతో కొత్త భవనం నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కలిసి ఉంటే ఎలా ఉంటుందనేదానికి ఈ భవనం నిదర్శనమన్నారు. రేపు సాయంత్రం మరో రూ.కోటి ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. రూ.3.5కోట్లతో మంచి భవనం, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల గురించి ఆలోచించదని, దేశంలో 10.50కోట్ల మంది గిరిజన జనాభా ఉంటే.. కేంద్రం బడ్జెట్‌లో పెట్టిందని కేవలం 0.02శాతమేనని.. రాష్ట్రంలో రూ.13,413కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్లు చెప్పారు.
అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నామని, వృత్తిని నమ్ముకొని ఉన్న వారికి కోసం ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. నిజాంపేట మున్సిపాలిటీలో గతంలో రెండు బస్తీ దావాఖనలు ఉండేవని.. వాటికి అదనంగా మరో ఎనిమిది మంజూరు చేస్తున్నామని, వారంలో ఆర్డర్‌ ఇస్తున్నామన్నారు. రెండు మూడునెలల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. కొంపల్లిలో రెండు బస్తీ దవాఖానలు పెంచుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణారావు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎరుకల సమాజం అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు.

Also Read : హైదరాబాద్లో నర్సరీ మేళా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్