Tuesday, June 9, 2026
HomeTrending Newsఓటర్ల జాబితాలో అక్రమాలు: జీవీఎల్ ఆరోపణ

ఓటర్ల జాబితాలో అక్రమాలు: జీవీఎల్ ఆరోపణ

సంక్షేమ పథకాల అమల్లో జగన్ ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని బిజెపి రాజ్యసభ సభ్యుడు  జివిఎల్ నరసింహారావు  ఆరోపించారు. బిజెపి కార్యకర్తలు అని తెలియగానే వారికి హక్కుగా లభించే పధకాలను కూడా కట్ చేస్తున్నారని విమర్శించారు.  రేషన్ కార్డులపై అనర్హత వేటు వేయడమో, పెన్షన్షన్ తొలగించడమో చేస్తున్నారని వివరించారు. విశాఖబిజెపి కార్యాలయంలో జీవీఎల్  మీడియాతో మాట్లాడారు.  పథకాలు తొలగించే విషయంలో అధికారులు విచక్షణతో మెలగాలని సూచించారు.

ఓటర్ల జాబితా సవరణలో కూడా అక్రమాలకూ పాల్పడుతున్నారని, పెద్ద సంఖ్యలో ఓటర్లను రద్దు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆంధ్రేతర ప్రాంతానికి చెందిన ఓటర్లను కావాలని జాబితాలోంచి తొలగిస్తున్నారని వెల్లడించారు. దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖరాశామని, ఇప్పటికే 50 వేలకు తక్కువ కాకుండా ఓట్లు గల్లంతు చేశారని, ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే చర్యలు మొదలయ్యాయన్నారు.

ఉద్దేశ పూర్వకంగా చేసినట్లు రుజువైన నేపద్యంలో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. లిక్కర్ స్కామ్ పై ఢిల్లో లో డొంక కదిలితే ఆంధ్రా తెలంగాణాల్లో మూలాలు వెలుగు చూస్తున్నాయని,  రెండు రాష్ట్రాల్లో అధికారపార్టీ కి సంబంధాలు వున్నట్లు తెలుస్తోందన్న జీవీఎల్ దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో హిందూపూర్ లో 4,200 ఎకరాలు బ్యాంకులకు తనకాపెట్టారని, ఆ భూములను 500 కోట్లకే ఒక ప్రైవేటు సంస్ధ చేజెక్కించుకుందంటే ఎంత దారుణమని విస్మయం వ్యఖ్తం చేశారు.

బెంగుళూరు కు సమీపంలో ఉన్న అత్యంత విలువైన భూములను  అడ్డగోలుగా కాజేసే చర్యలపై ఏపి ప్రభుత్వం స్పందించడా అని నిలదీశారు.  దీనిపై ఎన్.సి.ఎల్.టి తో సంప్రదించి వివారాలు ఆరా తీస్తానని, భూములను ఏ పర్పస్ కోసం ఇచ్చారు…ల్యాండ్ అగ్రిమెంట్ పై జరిగిన అంశాలు తెలపాలని, జగన్ ప్రభుత్వం దీనిపై అన్ని వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సిఎం బంధువైన ఓ ఎమ్మెల్యే కొడుకు సదరు సంస్ధలో డైరెక్టర్ గా వున్నారని, వారికి వుండే ఆసక్తి ఏంటో ఏపి ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు.

అమిత్ షా ,జూ ఎన్టీఆర్ భేటీలో రాజకీయప్రస్తావన లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించిన జీవీఎల్…  వారిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయో వారే చెప్పాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular