Monday, November 25, 2024
HomeTrending Newsఆరోపణలు అవాస్తవం: మంత్రి జయరాం

ఆరోపణలు అవాస్తవం: మంత్రి జయరాం

తాను పోలీసులను బెదిరించినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. దాదాగిరీ, దందాలు చేయడానికి తానేమీ అంతర్రాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్ ను కాదని వ్యాఖ్యానించారు. నేడు సిఎం జగన్ తో జయరాం సమావేశమయ్యారు. తనపై వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చారు.  ఆ తర్వాత అయన విలేకరులతో మాట్లాడారు. ఖాళీ ట్రాక్టర్లు పట్టుకుంటే పోలీసులకు ఫోన్ చేసి వదిలేయమని చెప్పిన మాట వాస్తవమేనని అంగీకరించారు. దౌర్జన్యంగా మాట్లాడితే తప్పని, తాను మాట్లాడిన దానిలో ఎక్కడా బెదిరించినట్లు లేదని వెల్లడించారు. సిఎం జగన్ తో నియోజకవర్గ సమస్యలపై చర్చించానన్నారు.

లోకేష్ అడ్డదారిలో రాజకీయాల్లోకి వచ్చారని, తండ్రి చంద్రబాబు పుణ్యమా అని ఎమ్మెల్సీ, మంత్రి అయ్యారని, లేకపోతే కనీసం సర్పంచ్ గా కూడా గెలవలేరని జయరాం విమర్శించారు. తాను 40 వేల ఓట్లతో గెలిచిన నాయకుడినని, లోకేష్ కు దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పేపర్లు రాసిన వార్తలతో తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం లోకేష్ కు తగదన్నారు. తన నియోజకవర్గం కర్నాటక సరిహద్దుల్లో ఉందని, మద్యం కోసం పరిసర గ్రామాల ప్రజలు వెళ్లి తాగి వస్తూ మద్యం తెచ్చుకుంటున్నారని,  వారిని తాను ఎలా నియంత్రించగలనని మంత్రి ప్రశ్నించారు. సిఎంగా జగన్ ఉన్నంత వరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్