Sunday, November 24, 2024
HomeTrending Newsచర్చకు సిద్ధమా? జోగి సవాల్

చర్చకు సిద్ధమా? జోగి సవాల్

Opne for Debate: సిఎం వైఎస్ జగన్ చేపట్టిన ఇళ్ళ నిర్మాణం పథకాన్ని కేంద్ర మంత్రి  ప్రశంసిస్తే,  దాన్ని  సహించలేక నేడు ఓ దినపత్రికలో ఈ పథపై ఓ అసత్య కథనాన్ని ప్రచురించారని   రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పునాదే దాటని పేదిల్లు – నత్తనడకన జగనన్న రత్నం’ అంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తపై అయన మండిపడ్డారు. ఈ కథనంలో పేర్కొన్నపశ్చిమ గోదావరి జిల్లా పాల కోడేరు గ్రామానికి చెందిన ఈ చెల్లెమ్మ అకౌంట్ లో ఇప్పటికే 70 వేల రూపాయల నిధులు జమ చేశామని, ఐరన్, సిమెంట్, ఇసుక ఉచితంగా సరఫరా చేశామని వివరణ ఇచ్చారు.

సిఎం జగన్ నాడు పాదయాత్రలో  పేదల బాధలు స్వయంగా చూశారు కాబట్టే ఇళ్లు లేని నిరుపేదలు ఏ ఒక్కరూ ఉండకూడదనే లక్ష్యం తోనే ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం 62వేల కోట్ల రూపాయల ఖర్చుతో నవరతాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జోగి వివరించారు.  స్వతంత్ర భారత దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా 30లక్షల 60 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.   ఇళ్ళ స్థలాలు ఇవ్వడంతో పాటు తొలి రెండు విడతల్లో కలిపి ఇప్పటికే 21 లక్షల 60వేల ఇళ్ళ నిర్మాణం కూడా మొదలు పెట్టమన్నారు. అలాంటి గొప్ప పతకంపై తప్పుడు రాతలు రాయడం శోచనీయమన్నారు.  14 ఏళ్ళపాటు సిఎంగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు ఇలాంటి ఇళ్ళ పథకాన్ని చేపట్టలేదని ఈ పత్రిక ఎందుకు ప్రశ్నించలేకపోయిందని జోగి నిలదీశారు.  ప్రజలను రెచ్చగొట్టేలా వార్తలు రాయడం తగదని హితవు పలికారు.  ఇళ్ళ నిర్మాణ ప్రగతిపై తమ శాఖ తరఫున ఓ వర్క్ షాప్ పెడతామని, దానికి సదరు పత్రిక యజమాని కూడా రావాలని జోగి  కోరారు.  ఈ కథనంపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు.  పత్రిక నుంచి కాకపోయినా ఆ పత్రిక  ఎవరికైతే వంత పాడుతుందో ఆ పార్టీ నేతలు కూడా రావొచ్చని ఛాలెంజ్ విసిరారు.

ఎంత లేపాలని చూసినా, తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు మళ్ళీ సిఎం కాలేరని జోగి జోస్యం చెప్పారు.  ఇలాంటి కథనాలు ఎన్ని రాసినా, చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా ఉపయోగం లేదన్నారు. బాదుడే బాదుడు కాదని, ప్రజలు బాబును కుమ్ముడే కుమ్ముడు అంటున్నారని, చివరకు కుప్పంలో కూడా తామే గెలుస్తామని,  175 సీట్లలో తామే విజయం సాధిస్తామని,  మంత్రి జోగి ధీమా వ్యక్తం చేశారు.

Also Read : జగన్ సామాజిక విప్లవవాది: జోగి రమేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్