Monday, May 20, 2024
HomeసినిమాUnstoppable-3: బాలయ్య 'అన్ స్టాపబుల్' కి కేటీఆర్ నో చెప్పారా..?

Unstoppable-3: బాలయ్య ‘అన్ స్టాపబుల్’ కి కేటీఆర్ నో చెప్పారా..?

బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ అంటూ టాక్ షో చేయడం.. ఈ టాక్ షో సక్సెస్ అవ్వడం తెలిసిందే. అసలు బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోకు హోస్ట్ గా చేయనున్నారని.. అది కూడా అల్లు అరవింద్ ఆహా కోసం చేయనున్నారని వార్తలు వచ్చినప్పుడు ఇది నిజమా..? అని అటు అభిమానులు, ఇటు ఇండస్ట్ర్రీ జనాలు షాక్ అయ్యారు. ఆతర్వాత ఇది నిజమే అని తెలిసింది. ఈ టాక్ షో అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది.  ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు అన్ స్టాపబుల్ థర్డ్ సీజన్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. బాలయ్య అన్ స్టాపబుల్ థర్డ్ సీజన్ చేయడానికి ఓకే చెప్పారు కానీ.. ఈ షోకు వచ్చే గెస్టులు ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. మెగాస్టార్ చిరంజీవితో ఒక ఎపిసోడ్ చేయాలి అనుకుంటున్నారు. దీనికి చిరంజీవి సూత్రప్రాయంగా ఓకే చెప్పారు కానీ.. ప్రస్తుతం కాలుకి సర్జరీ జరగడంతో రెస్ట్ తీసుకుంటున్నారు. అందుచేత ఇప్పటికిప్పుడు ఈ టాక్ షో చేయడానికి ఇంట్రస్ట్ చూపించడం లేదని తెలిసింది. నాగార్జున, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో చేద్దామంటే.. బాలయ్యకు నచ్చరు.  అందుచేత  వీళ్లతో చేయడానికి బాలయ్య ఇంట్రస్ట్ చూపించడం లేదట.

పొలిటికల్ గా బాగుంటుందనే ఉద్దేశ్యంతో కేటీఆర్ ను ఆహా నుంచి కాంటాక్ట్ చేశారట. అయితే.. ఎన్నికల బిజీలో ఉండడం వలన ఇది అనవసరం అనుకున్నారో ఏమో కానీ..  బిజీగా ఉండడం వలన కుదరదు అని సమాధానం చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఈ థర్డ్ సీజన్ కు మూడు ఎపిసోడ్స్ చేయాలి అనుకున్నారట. ఒకటి భగవంత్ కేసరి టీమ్ తో, రెండోది ఆహా కుటుంబం అవార్డుల టైప్ లో ప్లాన్ చేస్తున్నారట. మరి.. మూడో ఎపిసోడ్ ఎవరితో చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారట టీమ్. మరి.. ఎవరితో ప్లాన్ చేస్తారో.. చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్