పవన్ సినిమాల్లో హీరో అయి ఉండొచ్చని, కానీ రాజకీయాల్లో మాత్రం జీరో అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సినిమాల్లో లాగానే నిజ జీవితంలో కూడా తనకు ఎవరూ ఎదురు రాకూడదన్న భావనలో ఆయన ఉన్నారని విమర్శించారు. చంద్రబాబుతో ప్యాకేజీలు మాట్లాడుకుంటారని, అందుకే ఆయనకు ప్యాకేజీల పవన్ గా పేరు వచ్చిందన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ను ఎయిర్ పోర్ట్ రన్ వే మీదనే అడ్డుకున్నారని, కానీ నేడు పవన్ ను విశాఖలో తాము ఎక్కడా అడ్డుకోలేదన్నారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో కాకాణి మీడియాతో మాట్లాడారు. రాజ్యంగంపై పెద్ద పెద్ద మాటలు పవన్ మాట్లాడుతున్నారని… తాము రాజ్యాంగాన్ని గౌరవించి అమలు చేస్తున్నాం కాబట్టే మీలాంటి వ్యక్తులు స్వేచ్చగా తిరగగలుగుతున్నారని గుర్తుంచుకోవాలన్నారు.
జగన్ ను పదవి నుంచి దించి, చంద్రబాబును ఎలా గద్దెమీద కూర్చోబెట్టాలనే ఏకైక అజెండాతోనే పవన్ పనిచేస్తున్నారని కాకాణి విమర్శించారు. బాబుకు సుపుత్రుడి మీద నమ్మకం లేదని, అందుకే దత్తపుత్రుడైన పవన్ ను నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. పవన్ పొలిటికల్ జోకర్ గా మిగిలిపోతున్నారన్నారు. పవన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలకోసం పని చేయాలి కానీ స్వర్ధంతో పని చేస్తే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. బాబు-పవన్ మధ్య రహస్య ఒప్పందం ఉందనేది జగమెరిగిన సత్యమని పేర్కొన్నారు. కొంతమంది పిల్ల గ్యాంగ్ ను వేసుకొని, అడ్డమైన ఆరోపణలు, విమర్శలు చేయిస్తున్నారని, జన సేనాని అంటే ఎవరికి సేనాని అని ప్రశ్నించారు. అమరావతిపై బాబు ఆపినప్పుడు పవన్, పవన్ ఆపితే బాబు డోలు వాయించే వాళ్ళలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో బాబు ఓటమి దప్పదని కాకాణి జోస్యం చెప్పారు.
అమరావతిపై పవన్ కళ్యాణ్ మాట మారుస్తున్నారని, గతంలో కేవలం ఒక సామాజిక వర్గానికే అది రాజధాని అంటూ మాట్లాడి, ఇప్పుడు అమరావతి మా విధానం అంటున్నారని విమర్శించారు. పవన్ విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని, అయన రాజ్యాంగానికి ఏమైనా అతీడుడు అనుకుంటున్నారా అని నిలదీశారు.
Also Read : సినిమా డైలాగులకు భయపడం: పవన్ పై పేర్ని ఫైర్
Also Read : సవాళ్ళకు సిద్ధం : పవన్ కళ్యాణ్