డిసిఎంఎస్, డిసిసిబిల బలోపేతానికి ప్రభుత్వం పారదర్శక విధానాలను అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పలు జిల్లాల డిసిసిబిల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. సిఎం జగన్ ప్రభుత్వం వచ్చాక వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి వెలుగు చూస్తుందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల డీసీసీబీలు , డిసిఎంఎస్ ల ఛైర్ పర్సన్లు, అధ్యక్షులతో మంత్రి కన్నబాబు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు
⦿ సహకార బ్యాంకులను నష్టపరిచే ఎవ్వరిని ఉపేక్షించొద్దని సీఎం స్పష్టంగా చెప్పారు
⦿ డిసిసిబి ఛైర్మన్లు, డిసిఎంఎస్ అధ్యక్షులకు పూర్తి అవగాహన ఉండాలి, ప్రతి అంశంపై పట్టు సాదించాలి
⦿ గుంటూరు , కృష్ణాజిల్లాల డిసిసిబి పనితీరు మిగిలిన జిల్లాలకు ఆదర్శం
⦿ బ్యాంకుల్లో అయిదేళ్ల దాటిన మేనేజర్లను బదిలీ చేయాలి
⦿ రుణ పరిమితులు పెంచేలా ఆలోచనలు చేయాలి
⦿ మనం ఎంత బాధ్యత గా ఉంటే అంత సంతృప్తికరంగా మన విధులు నిర్వహించవచ్చు
⦿ రైతుల డబ్బును మనం అత్యంత బాధ్యతగా ఖర్చు చేయాలి
⦿ డిసిసిబి, డిసిఎంఎస్, పిఏసిఎస్ కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి
⦿ డిసిసిబి, డిసిఎంఎస్ పదవులని రాజకీయ పదవులగా చూడద్దు
⦿ సహకార వ్యవస్ధ బలోపేతంలో డిసిసిబి, డిసిఎంఎస్ లు అత్యంత కీలకం
⦿ సహకార వ్యవస్ధని పూర్తిగా ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ హామినిచ్చారు
⦿ బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడంలో డిసిసిబి చైర్మన్లు, డిసిఎంఎస్ చైర్మన్ల పాత్ర ప్రధానం
⦿ గత ప్రభుత్వం సహకార వ్యవస్థను పూర్తిగా అవినీతిమయం చేశారు
⦿ తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల తప్పుడు పత్రాలతో కోట్లాది రూపాయిలు దిగమింగారు
⦿ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు చోట్లా కుంభకోణాలని వెలికితీశాం
⦿ సహకార రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది
⦿ బ్యాంకులని నష్టపరిచే చర్యలని ఉపేక్షించవద్దని సిఎం వైఎస్ జగన్ ఆదేశించారు
⦿ బ్యాంకింగ్, ఆర్ధిక రంగంలో నిపుణులని పిఎసిఎస్, డిసిసిబిలలో డైరక్డర్లగా తీసుకునేలా చట్టంలో మార్పులు చేస్తున్నాం
⦿ సహకార వ్యవస్ధని సంస్కరించేలా అందరం కలిసికట్టుగా పనిచేయాలి
⦿ రుణాల మంజూరులో చేతివాటానికి పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి
⦿ కౌలు రైతులకి ఇతర జాతీయ బ్యాంకుల కంటే ఎక్కువగా రుణాలివ్వాలి
అప్కోబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి , ప్రిన్సిపాల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి , ఆర్.సి.ఎస్. కమిషనర్ అహ్మద్ బాబు , అప్కాబ్ ఎండి శ్రీనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు