9.2 C
New York
Monday, December 4, 2023

Buy now

Homeసినిమాతప్పనిసరి పరిస్థితుల్లోనే.... : నితిన్

తప్పనిసరి పరిస్థితుల్లోనే…. : నితిన్

నితిన్‌ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అందాధున్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకం పై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 17న ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌లో నితిన్, నభా నటేష్, తమన్నా, నరేష్, మంగ్లీ, కాసర్ల శ్యామ్, నిర్మాతలు ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి, రాజ్‌ కుమార్‌ ఆకెళ్ళ తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకలో నితిన్ మాట్లాడుతూ “నా అభిమానులకు ముందుగా సారీ. కోవిడ్ నిబంధనల వల్ల ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించలేకపోయాం. హిందీలో ‘అంధాదున్’ కల్ట్ సినిమా. రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు భయం వేసింది. కానీ నటుడిగా నిరూపించుకునేందుకు రిస్క్ తీసుకున్నాం. దర్శకుడు ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు. ఉన్నది ఉన్నట్టు తీస్తే ఏం తీశాడురా? అని అంటారు. మార్పులు చేర్పులు చేస్తే.. సోల్ లేదు చెడగొట్టారు అంటారు. కానీ గాంధీ మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీశారు. హిందీ సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో మన సినిమా కూడా అంత బాగుందని అనుకుంటారు. మహతి సాగర్ పాటల కంటే ఎక్కువగా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.

అంత మంచి ఆర్ఆర్‌ను థియేటర్లో చూస్తే బాగుంటుందని నేను, గాంధీ చాలా ఫీలయ్యాం. కానీ పరిస్థితుల వల్లే ఓటీటీలోకి వస్తున్నాం. డీఓపీ యువరాజ్ పనితనం కూడా బిగ్ స్క్రీన్‌లో చూస్తే బాగుండేది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ పనితనం కూడా బాగుంది. కానీ బిగ్ స్క్రీన్‌లో మిస్ అవుతున్నాం. మళ్లీ మన టీం అంతా కలిసి పని చేద్దాం. ఈ సినిమా కోసం చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఈ సినిమాకు క్యాస్టింగ్ చాలా ముఖ్యం. విలన్ కోసం జిషును తీసుకున్నాం. టబు పాత్రకు చాలా మందిని అనుకున్నాం కానీ తమన్నా ఒప్పుకుంటుందా? లేదా? అనుకున్నాం.

మంగ్లీ యాక్టింగ్ చూసి సింగరా? యాక్టరా? అని షాక్ అయ్యాను. ఇక పై ఆమె సింగర్‌గా పక్కకెళ్లి.. యాక్టర్‌గా బిజీగా అవుతుంది. అలా ప్రతీ ఒక్క పాత్రకు సరైన నటీనటులు దొరకడం చాలా అరుదు. అలాంటి అరుదైన చిత్రాల్లో ఈ మాస్ట్రో కూడా ఒకటి అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ సినిమాను తీసినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. అంతే కాకుండా అందరికీ సమయానుగుణంగా డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్. నరేష్ ఇండస్ట్రీలో నాకు ఫాదర్ లాంటి వారు. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. నా తదుపరి చిత్రంలో కూడా మీరే (నరేష్) నా ఫాదర్. నేను ఫాదర్, మీరు గ్రాండ్ ఫాదర్ అయ్యే వరకు ఇలానే మన జర్నీ కొనసాగుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 17న హాట్ స్టార్‌లో రాబోతోంది. సినిమాను చూడండి మీ అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్