Saturday, November 23, 2024
HomeTrending Newsఏడాదిన్నరలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు

ఏడాదిన్నరలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు

అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున హూస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల విగ్రహ పనులు చురుకుగా సాగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. 50 అడుగుల పీఠంతో కలిపి మొత్తం 175 అడుగులలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. విగ్రహ పనులను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం పరిశీలించారు. ఇది కాంస్య విగ్రహమని, గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తర్వాత ఇదే ఎత్తైనదన్నారు.

అంబేడ్కర్ విగ్రహాలలో  హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నదే అతి పెద్దది,ఎత్తైనదని మంత్రి కొప్పుల వివరించారు. దీనిని 11.4 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ మ్యూజియం,ఫోటోల ఆర్ట్ గ్యాలరీ, ఎగ్జిబిషన్ గ్రంథాలయం, ధ్యానమందిరం, సమావేశ మందిరం, లేజర్ షో, క్యాంటీన్,సువిశాలమైన పార్కింగ్ ఉంటాయన్నారు. ఇక్కడ స్కిల్ డెవలప్ మెంట్ వర్క్ షాపులు, సెమినార్లు జరుగుతాయని, ఇది ముఖ్య పర్యాటక ప్రదేశంగా వెలుగొందనుందన్నారు. పలు పరీక్షలు, డిజైన్ ఖరారు, సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున,  చైనా, సింగపూర్ లలో ఇటువంటి భారీ విగ్రహాలను పరిశీలించామని,ఈ కారణాల వల్ల కొంత ఆలస్యం జరిగిందని మంత్ర్రి వివరించారు.

కెసిఆర్ దీనిని త్వరితగతిన పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని, ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును 12 నెలల నుంచి 15నెలల్లో పూర్తి చేయాల్సిందిగా కెపిసి సంస్థను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు మరియు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, పలువురు అధికారులు,నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్