Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్ధోనికి కృతజ్ఞతలు : గంగూలీ, షా

ధోనికి కృతజ్ఞతలు : గంగూలీ, షా

ఐసిసి టి-20 వరల్డ్ కప్ లో టీమిండియాకు మెంటార్ గా ఉండేందుకు అంగీకరించిన మహేంద్ర సింగ్ దోనీకి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా కృతజ్ఞతలు తెలియజేశారు. ధోనీ అనుభవం భారత జట్టుకు ఎంతగానో తోడ్పడుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. బిసిసిఐ విజ్ఞప్తికి ధోనీ సానుకూలంగా స్పందించడం గొప్ప విషయమని వ్యాఖానించారు.

ధోనీ ఎంపిక ఓ అద్భుతమైన నిర్ణయమని, భారత జట్టు తప్పకుండా కప్ గెల్చుకుంటుందని గతంలో టీమిండియాకు మేనేజర్, మీడియా మేనేజర్ గా పని చేసిన అనిరుద్  ధీమాగా చెప్పాడు.

రవిశాస్త్రి, ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో కూడిన సంయుక్త నాయకత్వంలో టీమిండియా కప్ గెల్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బిసిసిఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. తాను ధోనీతో స్వయంగా మాట్లాడానని, మెంటార్ గా ఉండేందుకు వెంటనే అంగీకరించాడని షా తెలిపాడు. ఇదే విషయమై ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవి శాస్త్రి లతో కూడా సంప్రదించానని, తమ ప్రతిపాదనను వారు కూడా స్వాగతించారని వివరించాడు.

ఐపీఎల్ ఆడేందుకు ప్రస్తుతం ధోనీ దుబాయ్ లోనే ఉన్నాడు.  కోవిడ్ కారణంగా మధ్యలో నిలిచిపోయిన ఐపీఎల్ మ్యాచ్ లు సెప్టెంబర్ 19 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది, ఐపీఎల్ ముగిసిన రెండ్రోజులకే అంటే అక్టోబర్ 17 నుంచి టి-20 వరల్డ్ కప్ టోర్నీ మొదలు కానుంది. అయితే తొలుత ఎనిమిది జట్ల మధ్య  రౌండ్ 1 మ్యాచ్ లు జరుగుతాయి. వీటిలో నుంచి నాలుగు జట్లు సూపర్ 12 కు చేరుకుంటాయి. సూపర్ 12 మ్యాచ్ లు అక్టోబర్ 23 నుంచి మొదలవుతాయి. ఇండియా అక్టోబర్ 24న తన మొదటి మ్యాచ్ దాయాది జట్టు పాకిస్తాన్ తో ఆడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్