Thursday, March 28, 2024
HomeTrending Newsమోడీ ఏలుబడిలో నిరుద్యోగం పతాకస్థాయికి - మంత్రి కేటిఆర్

మోడీ ఏలుబడిలో నిరుద్యోగం పతాకస్థాయికి – మంత్రి కేటిఆర్

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో ఈ దేశం గతి ఏమయిందో చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మోదీ పాలనలో మన దేశం అన్నీంటలో హైయేస్టేననన్నారు. ౩౦ ఏండ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక ద్రవ్యోల్బణం మోదీ నాయకత్వం వహిస్తున్న ఈ దేశంలో నమోదయిందని మంత్రి అన్నారు. ద్రవోల్బణమే కాదు 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత పతాక స్థాయికి నిరుద్యోగం చేరుకుందన్నారు. ప్రపంచంలోనే హైయెస్ట్‌ సిలిండర్‌ ధర ఇవాళ ఇండియాలో ఉందని, నాలుగు వందల రూపాయల సిలిండర్‌ ధరను 12వందలు చేసి మన ఆడ బిడ్డలకు ప్రధాని మోదీ విలువైన కానుక ఇచ్చారని కేటీఆర్‌ ఎద్దేవ చేశారు. ఇవే కాదు ప్రపంచలోనే అత్యంత ఎక్కువ పెట్రోలు ధర కలిగిన మూడో దేశం మనదని కేటీఆర్‌ అన్నారు. ఈ హైయెస్ట్‌ ఘనతలే కాదు మోడీ ఘనకార్యాలు, అమలు కాని హామీలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. గూగుల్‌ వెతికితే 2018లో మోదీ ఇచ్చిన హామీలు దొరికాయని మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీలో సభకు తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని డబుల్‌ చేస్తామని, దేశంలోని ప్రతి పౌరుడికి సొంత ఇల్లు కట్టిస్తామని, దేశమంతా బుల్లెట్‌ రైళ్లు పరుగెడతాయని, 2022కల్లా దేశంలోని ప్రతి ఇంటికి కరెంటు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. వచ్చిందా కరెంటు అని మంత్రి ప్రశ్నించారు. 2022 కల్లా దేశ ఆదాయాన్ని ఐదు ట్రిలియన్‌ డాలర్లు చేస్తామని, బారతదేశం నుంచి అంతరిక్షంలో అస్ట్రోనాట్లను పంపుతామని మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేటీఆర్‌ సభలో ప్రశ్నించారు.

లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కలిగే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టు కడుతరా?.. అందులో ఎంత అవినీతి పొంగుతుందో అని బీజేపీ నేతలు అరుస్తున్నరని మంత్రి అన్నారు. మరి లక్షా పదివేల కోట్లు పెట్టి అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి బెల్లెట్‌ రైలు వేస్తే తప్పులేదు కానీ లక్షలాది ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టు కడితే తప్పా అని మినిస్టర్‌ కేటార్‌ నిలదీశారు. అంత ఖర్చు పెట్టి బుల్లెట్‌ రైలు అవసరమా అని ప్రతిపక్షాలు అడిగినపుడు బుల్లెట్‌ రైలు అక్కర్లేదన్నవారు ఎడ్లబండిపై తిరగండని మోదీ హేళన చేసిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు.

Also Read :  సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి: మంత్రి కేటీఆర్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్