Saturday, January 18, 2025
HomeTrending Newsఘనంగా కేటిఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేటిఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐ.టి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కేటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపి జోగినపల్లి సంతోష్ రావు ముక్కోటి వృక్షార్చణకు పిలుపు ఇచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఎంపి పిలుపు మేరకు మంత్రుల నుంచి సామాన్య కార్యకర్త వరకు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకున్నామని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో మొక్కలు నాటుతున్న నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలకు పేరు పేరునా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఎంపి జోగినపల్లి సంతోష్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

 

కోల్ బెల్ట్ ఏరియాలో పచ్చదనం పెంచేందుకు సింగరేణి చేస్తున్న కృషి అమోఘం. ఒక్క రామగుండంలోనే ఇవాళ ఐదు లక్షల మొక్కలు నాటేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కోరికంటి చందర్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేసి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన ముక్కోటి వ్రుక్షార్చనలో భాగంగా మొక్కల్ని నాటారు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, నగర మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు ఎడ్ల సరిత అశోక్, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

అసెంబ్లీ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌ రెడ్డి మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ ముక్కోటి వృక్షార్చనలో భాగంగా సుల్తానాబాద్ లో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్,ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,ఎంపీ వెంకటేష్ నేత,పలువురు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజలు

వికారాబాద్  MLA Drఆనంద్ , MLC  మహేందర్ రెడ్డి  తో కలిసి వికారాబాద్ లో మొక్కలు నాటడం జరిగింది

కేటీఆర్ జన్మదినం సందర్భంగా వనపర్తి చందాపూర్ అటవీప్రాంతంలో మొక్కలు నాటి, కేక్ కట్ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 

మున్సిపల్ శాఖ మంత్రి KTR జన్మదినం సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ క్రింద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద ఒక దివ్యాంగుడికి త్రిచక్ర వాహనాన్ని అందజేశారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలలో మంత్రి తలసాని పాల్గొన్నారు. కూకట్ పల్లి MLA కృష్ణారావు ఆధ్వర్యంలో మొక్కలు నాటిన అనంతరం రక్తదాన శిభిరాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని మంత్రి ప్రారంభించారు.

 

 

 

 

 

ముక్కోటి వృక్షార్చనలో భాగంగా నేడు మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం, రామచంద్రాపురంలో 10 ఎకరాల విశాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనంలో 31 వేల మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీమతి మాలోతు కవిత, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్, బయ్యారం PACS చైర్మన్ మధుకర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్,  జిల్లా అటవీ శాఖ అధికారి రవి కిరణ్, జెడ్పీ సీఈవో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

 

బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం10 నుండి 11 గంటల వరకు ఏకకాలంలో అన్ని మండల కేంద్రాలు,గ్రామ పంచాయతీల్లో 3లక్షల 40వేల మొక్కలు నాటి విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టిఆర్ఎస్ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు.

ముక్కోటి వృక్షార్చణ కార్యక్రమంలో భాగంగా ల‌క్ష్మ‌ణ‌చాంద గ్రామంలో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మొక్క‌లు నాటారు.

తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని  పాల పిట్ట పార్క్ లో కెనరా బ్యాంక్ సౌజన్యంతో మొక్కలు నాటిన ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభకార్ రెడ్డి,టీఎస్ ఎఫ్ డిసి చైర్మన్ ఒంటెరు ప్రతాప్ రెడ్డి, ఎస్సి ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, అటవీ శాఖ,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్