Thursday, March 12, 2026
HomeTrending Newsసిఎంకు కృతజ్ఞతలు : కేటిఆర్

సిఎంకు కృతజ్ఞతలు : కేటిఆర్

నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్ తో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, అమలులోకి తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు నూతన జోనల్ వ్యవస్థ రూపుదిద్దుకుందని కేటీఆర్ అన్నారు.  ఈ మేరకు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.

 ప్రజల ఆకాంక్షల మేరకు పాలన ప్రయోజనాలను ప్రజలకు వేగంగా తీసుకువెళ్లేందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడంతోపాటు, ఆయా జిల్లాలను ప్రత్యేక జోన్లుగా వర్గీకరించడం జరిగిందన్నారు.  జిల్లా స్థాయి పోస్టయిన జూనియర్ అసిస్టెంట్ నుంచి మొదలుకొని జోన్లు, మల్టీ జోన్ ఉద్యోగాల వరకు అన్ని స్థాయిల ఉద్యోగాల్లో స్థానిక ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నూతనంగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణ్ పేట జిల్లాలను ఆయా జోన్లలో చేర్చి చట్టబద్ధం చేయడంతో పాటు, వికారాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు ఆ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తేవడం పట్ల ఆయా జిల్లాల ప్రజల తరఫున ముఖ్యమంత్రి కి,  ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మించి వివిధ శాఖల ద్వారా 1,33,000 చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువత కి అందించామన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా గత ఏడేళ్లలో టీ.ఎస్.ఐ.పాస్ విధానం ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేల పరిశ్రమలు రాష్ట్రంలోకి ఆకర్శించగలిగాం. తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular