Saturday, April 20, 2024
HomeTrending Newsపల్లెప్రగతితో అభివృద్ధికి శ్రీకారం

పల్లెప్రగతితో అభివృద్ధికి శ్రీకారం

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకువచ్చి గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రతినెల టంచనుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు అందిస్తున్నారని తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని దేవునిపల్లి,కారేపల్లి గ్రామాల్లో  రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం పర్యటించారు.

దేవునిపల్లి గ్రామం వడ్డెర గుడిసె కాలనీ వద్ద మహిళలు రోడ్లు సమస్యను మంత్రి దృష్టికి తీసుకురాగా… వారి కాలనీ రోడ్ల దుస్థితి చూసి చలించిపోయిన మంత్రి వెంటనే ఐదు సి.సి రోడ్ల కోసం 15 లక్షల నిధులు మంజూరు చేశారు.అడిగిన వెంటనే కాదనకుండా అక్కడికక్కడే 15లక్షలు మంజూరు చేసినందుకు వడ్డెర గుడిసె మహిళలు ఆనందం వ్యక్తం చేసారు.

అనంతరం కారేపల్లి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు వాడల్లో కలియతిరిగారు.ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. గ్రామ పంచాయితీ ఆవరణలో మొక్కలు నాటారు. కారేపల్లి గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 10లక్షల అదనపు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ఇచ్చే ప్రత్యేక నిధులు,నరేగా నిధుల సక్రమ వినియోగం వల్ల గ్రామాల్లో వైకుంఠ దామాలు,పల్లె ప్రకృతి వనాలు, డంప్ యార్డులు,డ్రైనేజీలు,సి.సి రోడ్లు,గ్రామానికో ట్రాక్టర్,ట్రాలీ,వాటర్ ట్యాంకర్, రైతు వేదికలతో పల్లెల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతోందని మంత్రి వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్