Tuesday, June 9, 2026
HomeTrending Newsదక్షిణ తెలంగాణ నానో ప్లాంట్ కు అనుకూలం

దక్షిణ తెలంగాణ నానో ప్లాంట్ కు అనుకూలం

తెలంగాణలో సాగునీటి సరఫరా, రైతుబంధు, రైతుభీమా, ఉచితంగా 24 గంటల కరంటు సరఫరా మూలంగా తెలంగాణలో  వ్యవసాయం మీద రైతులకు నమ్మకం కుదిరిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.  వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుండి పండుగ అనే పరిస్థితికి వచ్చిందన్నారు. బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో ఇఫ్కో ప్రతినిధులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో సమావేశమయ్యారు. పంటల ప్రణాళిక ప్రకారం తెలంగాణకు యూరియా సరఫరా చేయండని ఈ సందర్భంగా  ఇఫ్కో అధికారులని మంత్రి కోరారు. గత ఏడేళ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని వారికి వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలో రెండో స్థానానికి చేరిందని, రైతుల ఆత్మహత్యలు తగ్గి ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణలో పంటల సాగుకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలి. తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు కోసం ఇఫ్కో సమావేశంలో చర్చించాలని కోరారు. దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటుతో దక్షిణ భారతదేశం మొత్తానికి అందుబాటులో ప్లాంటు ఉంటుందని ఇఫ్కో ప్రతినిధులకు మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్, జీఎం జగన్ మోహన్  రెడ్డి , తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular