వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబు, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
కాణిపాకం బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉత్సవాలకు నాందిగా ధ్వజారోహణం చేస్తారు. సెప్టెంబర్ 20వ తేదీ వరకు ప్రతిరోజూ వాహన సేవలుంటాయి. సెప్టెంబర్ 7న రథోత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 08వ తేదీన కల్యాణోత్సవం జరుగుతుంది. 20వ తేదీన జరిగే తెప్పోత్సవంతో ఈ ఏటి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.