Friday, April 4, 2025
HomeTrending Newsలోకేష్ కు లోక జ్ఞానం లేదు: పెద్దిరెడ్డి

లోకేష్ కు లోక జ్ఞానం లేదు: పెద్దిరెడ్డి

ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో తెలుగుదేశం నేత నారా లోకేష్ రాసిన లేఖ అతని అజ్ఞానాన్ని బైట పెట్టిందని  రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాజలీ, మైన్స్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. లోకేష్ కు కనీస లోకజ్ఞానం కూడా లేదనే విషయం  రాష్ట్ర ప్రజల ముందు మరోసారి స్పష్టమయ్యిందన్నారు. ముఖ్యమంత్రికి లేఖరాసే సందర్భంలో కనీస వాస్తవాలు తెలుసుకునే ఇంగితం లోకేష్ కు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.  అవివేకం, అనుభవరాహిత్యం, అజ్ఙానానికి కేరాఫ్ లోకేష్ అని అనుకుంటున్న సొంత తెలుగుదేశం నేతల మనస్సులోని మాటలకు అద్దం పట్టేలా లేఖల్లో ప్రేలాపనలు ఉన్నాయన్నారు. లోకేష్ లేఖకు ప్రతిస్పందనగా పెద్దిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

సచివాలయ వ్యవస్థను తీసుకురావడం ద్వారా సీఎం జగన్ పాలనలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికారని, లక్షలాది మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించి, యువతలో స్పూర్తిని నింపారని పెద్దిరెడ్డి తెలిపారు. విద్యుత్ శాఖను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సచివాలయాల పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేశారని, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందితో సమానంగా ఎనర్జీ అసిస్టెంట్ లకు ఆర్ఇసి, ఎన్టిపిఐ వంటి ప్రఖ్యాతిగాంచిన సంస్థల తోడ్పాటుతో వృత్తినైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమాలను ఇచ్చామని వివరించారు. దీనికి తోడు సంస్థాపరంగా కూడా ఎప్పటికప్పుడు ఎనర్జీ అసిస్టెంట్ లకు వృత్తి నైపుణ్యం పెంచే ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల సమయంలో ఎటువంటి శిక్షణ లేకుండా స్తంభాలను ఎక్కించి, ఎనర్జీ అసిస్టెంట్ లను ప్రమాదాల్లోకి నెడుతున్నారంటూ లోకేష్ తన లేఖలో పేర్కొనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి దుయ్యబట్టారు.

పెద్దిరెడ్డి లేఖలోని ముఖ్యాంశాలు:

  • సచివాలయ ఉద్యోగులందరికీ ప్రభుత్వపరంగా వర్తించే అన్ని నిబంధనలు ఎనర్జీ అసిస్టెంట్ లకు వర్తిస్తున్నాయి.
  • సెలవులు, ఇతర సదుపాయాలు వారికి ఇతరులతో సమానంగానే కల్పించడం జరిగింది.
  • సెలవులు లేకుండా పనిచేయాల్సి రావడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటూ లోకేష్ వాపోవడం విడ్డూరంగా ఉంది.
  • సచివాలయ ఉద్యోగులందరికీ ప్రొబెషనరీ ప్రకటించాలని సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎనర్జీ అసిస్టెంట్ లకు కూడా ప్రొబెషనరీ ప్రకటించడం జరిగింది.
  • ఈ విషయంలోనూ లోకేష్ తన అవగాహన లేమిని చాటుకున్నారు.
  • ప్రొబెషనరీకి ముందు రూ.15వేల జీతం ఉంటే, ఆ తరువాత అది రూ.31 వేలకు పెరిగిన విషయం లోకేష్ కు తెలియకపోవడం విచారకరం.
  • సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లు ప్రతికూల పరిస్థితుల్లోనూ రెగ్యులర్ విద్యుత్ రంగ సిబ్బందితో కలిసి తమ శక్తిమేరకు సేవలు అందిస్తున్నారు.
  • దీనివల్లే  రాష్ట్ర విద్యుత్ సంస్థలు వినియోగదారుల సేవా సూచికలో జాతీయ స్థాయిలో ఏ గ్రేడ్ సాధించాయి.
  • విధి నిర్వహణలో ఎనర్జీ అసిస్టెంట్లు ప్రాణాలను కోల్పోతున్నారనే ఆరోపణల్లోనూ వాస్తవం లేదు.
  • తగు భద్రతా పరికరాలను ఉపయోగించకుండా వ్యక్తిగత అశ్రద్ధ కారణంగా జరిగిన కొన్ని కొన్ని ప్రమాదాలను భూతద్దంలో చూపుతూ విమర్శించటం సరికాదు
  • వారికి ఎటువంటి ఆర్థిక సహకారాన్ని అందించడం లేదనే ఆరోపణ కూడా నిజం కాదు.
  • ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఎనర్జీ అసిస్టెంట్లు మాత్రమే కాక రెగ్యులర్ సిబ్బంది కూడా కొన్ని చోట్ల ప్రమాదాలకు గురవుతున్నారు.
  • అలాంటి సమయంలో వారికి కావలసిన అన్ని రకాల సహకారాలను  సంస్థ తరపున అందజేస్తున్నాం.
  • ఒక్కోసారి దురదృష్టవశాత్తు విలువైన ప్రాణాలు కోల్పోయిన ప్పుడు సిబ్బందికి ఇచ్చే అన్ని రకాల పరిహారాలను ఎనర్జీ అసిస్టెంట్ లకు కూడా అందిస్తున్నాం
  • ఈ వాస్తవాలను వక్రీకరిస్తూ బాధ్యతాయుతమైన ఎనర్జీ అసిస్టెంట్ ల అమూల్యమైన సేవలను కట్టుబానిసలు, వెట్టిచారికి వంటి పదాలతో లోకేష్ అపహాస్యం చేసేలా, కించపరిచేలా మాట్లాడటంను తీవ్రంగా ఖండిస్తున్నాం.
  • ఏదైనా అంశంపై స్పందించే సమయంలో ఇకనైనా లోకేష్ వాస్తవాలను తెలుసుకుకోవాలని హితవు చెబుతున్నాం.
RELATED ARTICLES

Most Popular

న్యూస్