Tuesday, March 10, 2026
HomeTrending Newsఅధికారులతో పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్

అధికారులతో పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్

మాండూస్ తుఫాను సహాయక చర్యలపై ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి జిల్లా కలెక్టరేట్ లో సహచర మంత్రి శ్రీమతి ఉషశ్రీ చరణ్, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.  తుఫాన్ నష్టం, బాధితులకు సహాయం, తక్షణ చర్యలుపై చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు.

మరోవైపు, మాండోస్ తుఫాన్ బాధితులకు ఆర్థిక సహాయం విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వై ఎస్సార్ జిల్లాల బాధితులకు ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలు, కుటుంబానికి గరిష్టంగా 2 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, పునరావాస కేంద్రాల నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ సాయాన్ని వారికి ఇవ్వాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular