Monday, March 10, 2025
HomeTrending NewsRK Roja: వన్స్ అగైన్ వైఎస్సార్సీపీ: మంత్రి రోజా

RK Roja: వన్స్ అగైన్ వైఎస్సార్సీపీ: మంత్రి రోజా

పవన్ ఇరిటేషన్ స్టార్… చంద్రబాబు ఇమిటేషన్ స్టార్ అయితే… సిఎం జగన్ ఇన్ స్పిరేషన్ స్టార్ అని  రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి రోజా  అభివర్ణించారు, హలో ఏపీ, బై బై బిపి (బాబు-పవన్) … వన్స్ అగైన్ వైఎస్సార్సీపీ అనేది మా నినాదమని… బాబు, పవన్ లు  జగన్ కాలిగోటికి కూడా సరిపోరని, మరోసారి జగన్ సిఎం కాకుండా ఆపే శక్తి వారికి లేదని  వ్యాఖ్యానించారు. రికార్డులు సృష్టించాలన్నా, తిరగారాయాలన్నా అది జగన్ కే సాధ్యమని స్పష్టం చేశారు.  మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పుత్తూరులో ఆయన విగ్రహానికి మంత్రి రోజా  పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు విజయ డెయిరీ ని సిఎం జగన్ పునరుద్ధరించి పాడి రైతుల జీవితాలో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు.  14 ఏళ్ళు సిఎంగా పనిచేసిన చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థను మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. విజయ డెయిరీ మూత పడేట్లు చేసి పాడి రైతుల జీవితాలను అంధకారం చేశారని విమర్శించారు.  అర్హత ఉండి పథకాలు రానివారిని గుర్తించి జనగన్న సురక్షా ద్వారా వారికి లబ్ధి చేరూరుస్తున్నారని రోజా వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్