7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

HomeTrending NewsRahstrapathi: రాష్ట్రపతికి ఘన స్వాగతం

Rahstrapathi: రాష్ట్రపతికి ఘన స్వాగతం

హైదరాబాద్ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొద్ది సేపటి క్రితం ఘన స్వాగతం పలికారు.  సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్, శంభీపూర్ రాజు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనికుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మేడ్చల్ కలెక్టర్ తదితరులు ఉన్నారు.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ఈ రోజు హైదరాబాద్ వచ్చారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా క్షత్రియ సేవ సమితి ఆద్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్